Updated : 03/10/2021 18:26 IST

Sai Dharam Tej: ఆస్పత్రి నుంచి సాయిధరమ్‌ తేజ్‌ ట్విటర్‌లో చేసిన పోస్ట్‌ ఇదే!

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్‌ కోలుకుంటున్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా  పోస్టు పెట్టి, అభిమానులకు చల్లటి కబురు చెప్పారు.

ట్విటర్‌లో థంబ్స్‌ అప్‌ సింబల్‌ చూపిస్తూ ‘‘మీరు నాపై, నా సినిమా ‘రిపబ్లిక్‌’పై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కృతజ్ఞతగా థ్యాంక్స్‌ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. మీ అందరి ముందుకు త్వరలోనే వస్తా’’ అని ట్వీట్‌ చేశారు.

సెప్టెంబరు 10న స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలో వెళ్లారు. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెల్మెట్‌ ఉన్నా, ప్రమాద తీవ్రత కారణంగా గాయాలు బలంగా తగిలాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో దగ్గర్లోని మెడికవర్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయితేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయితేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘రిపబ్లిక్‌’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్‌, రమ్యకృష్ణ, జగపతిబాబులు కీలక పాత్రలు పోషించారు. సాయితేజ్‌ ఇందులో కలెక్టర్‌గా నటించి మెప్పించారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని