
హీరో పేరుతో ఎర
స్క్రీన్ షాట్ షేర్ చేసిన సాయితేజ్
హైదరాబాద్: హీరో సాయిధరమ్ తేజ్ పేరు ఉపయోగించి డబ్బుల కోసం ఓ వ్యక్తి అమాయకులకు ఎర వేస్తున్నాడు. తన పేరు సాయిధరమ్ తేజ్ అని చెప్పుకోవడమే కాకుండా తాను ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. ఆన్‌లైన్‌లో వెంటనే డబ్బులు పంపించమని కోరుతూ ఇటీవల పలువురికి మెస్సేజ్‌లు పంపించాడు. తాజాగా ఆ మెస్సేజ్‌లు సాయిధరమ్ తేజ్ దృష్టికి వెళ్లాయి. వెంటనే ఆయన పోలీసులను సంప్రదించారు.
ఇన్‌స్టా వేదికగా సాయితేజ్ తాజాగా దీనిపై ఓ పోస్ట్ పెట్టారు. ‘గుర్తుతెలియని ఓ వ్యక్తి నా పేరు ఉపయోగించుకుంటూ పలువురు అమాయకుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు తాజాగా నా దృష్టికి వచ్చింది. సదరు వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి మీరందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నాను. నాపేరుతో వచ్చే మెస్సేజ్‌లను నమ్మకండి’ అని సాయితేజ్ పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘సోలో బ్రతుకే సోబెటర్’ తర్వాత సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవకట్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయితేజ్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రానుంది. ఇటీవల విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.