sai pallavi:నటిగా నన్ను అంగీకరిస్తారా అనుకున్నా!
అందం కాదు అభినయం ప్రదానం అనుకుంటుందామె.. నాయికగా కంటే నటిగా ఉండటమే ఆమెకు ఇష్టం.. గ్లామర్ పాత్రలకంటే గ్రామర్ పాత్రలకే ఓటు వేస్తుందామె.. ఆ పాజిటివ్ దృక్పథంతోనే మేకప్ లేకుండా ఎంపిక చేసుకున్న పాత్రల్లో ఒదిగిపోతుంది. నటిగా నన్ను స్వీకరిస్తారా... అనే సందేహంతో మొదలైన ఆమె ప్రస్థానం ఈ స్థాయికి ఎలా చేరుకుంది? తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది సాయి పల్లవి.. మే 9 ఆమె పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో వివిధ సందర్భాల్లో సాయి పల్లవి పంచుకున్న విశేషాలు మీకోసం..
డ్యాన్స్ అంటే ఇష్టం
‘‘మాది ఊటీకి దగ్గరిలోని ఉన్న కోటగిరి గ్రామం. కోయంబత్తూర్‌లో చదువుకున్నా. నాన్న సెందామరై కన్నణ్, కస్టమ్స్ అధికారి. అమ్మ రాధ, నాట్యకారిణి. నేనూ చెల్లెలు పూజా కవల పిల్లలం. అమ్మ చేసే నృత్యం చూస్తూ పెరగడంతో మాకూ నాట్యంపై ఆసక్తి పెరిగింది. పాఠశాల రోజుల నుంచే నృత్య కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్లం. నా డ్యాన్సు చూసిన ఓ సినిమా ఏజెన్సీ వాళ్లు చిన్న పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా. నాకు లెక్కలు అంటే చాలా భయం. ఆ క్లాస్ నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనతో సినిమా విషయం అమ్మకి చెప్పి ఒప్పించా’’
అందుకే జార్జియాకి వెళ్లాల్సి వచ్చింది..
‘‘అలా తెరపై తొలిసారి ‘ధామ్ ధూమ్’ (తమిళం)లో కంగనా రనౌత్ పక్కన కనిపించాను. మరో తమిళ సినిమాలో మీరా జాస్మిన్ క్లాస్‌మేట్‌గా నటించాను. ఆ తర్వాత నటనకు విరామం ఇచ్చి డ్యాన్సు షోలపై దృష్టి పెట్టాను. తమిళంలో స్టార్ విజయ్, తెలుగులో ఈటీవీ నిర్వహిస్తోన్న రియాలిటీ షోల్లో (ఢీ) అవకాశం వచ్చింది. అప్పటి నుంచి కోయంబత్తూర్‌లో నేనో వీఐపీని అయిపోయాను. నలుగురు నన్ను అభిమానిస్తుంటే ఆనందంగా ఉండేది. వాళ్ల అభినందల కోసం మరింత కష్టపడేదాన్ని. అప్పుడు నాయికగా చేయమంటూ ఎందరో దర్శకులు అడిగారు. అమ్మానాన్న నో చెప్పారు. ‘నాయికగా కెరీర్ కొన్నాళ్లు బాగానే ఉంటుంది. ఆదరణ తగ్గాక ఏం చేస్తావ్’ అని వాళ్లు అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియలేదు. నేనిక్కడుంటే మళ్లీ సినిమా అంటానని దానికి దూరంగా ఉండేందుకు జార్జియాలో మెడిసిన్‌లో చేర్పించారు’’
అయినా ఆసక్తి ఊరుకోనిస్తుందా..
‘‘వైద్య విద్యనభ్యసించడంలో నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. నటి అవ్వాలనే ఆసక్తి మాత్రం అలానే ఉంది. ఓ సారి దర్శకుడు అల్ఫోన్స్ తానో కొత్త చిత్రం తెరకెక్కిస్తున్నానని, అందులో నటించాలని మెయిల్ చేశారు. స్కిప్టు నాకు బాగా నచ్చింది. సెలవుల్లో మాత్రమే నటించు అని నాన్న షరతు పెట్టారు. అదే ‘ప్రేమమ్’ (మలయాళం). దాని తర్వాత ‘కలి’ అవకాశం వచ్చింది. మరోవైపు నా మెడిసిన్ కూడా పూర్తయింది. ఆ తర్వాతే తెలుగులో ‘ఫిదా’ చేశాను. అప్పటి నుంచి మీకు తెలిసిందే కదా’’
నా దృష్టిలో గ్లామర్ అంటే..
‘‘గ్లామర్ అనే పదానికి ఒక్కొక్కరూ ఒక్కో అర్థం చెబుతారు. నా దృష్టిలో గ్లామర్ అంటే నేను ఎంపిక చేసుకున్న పాత్ర ప్రేక్షకులకి చేరువవడం. ‘ప్రేమమ్’ సమయంలో ప్రేక్షకులు నన్ను కథానాయికగా స్వీకరిస్తారా, లేదా? అనే భయం ఉండేది. ముఖంపై మొటిమలతో తెరపై ఎలా కనిపిస్తానో అనుకునేదాన్ని. నాకు నేనే నచ్చడం లేదు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారా? అనే ప్రశ్న నన్ను వేధించేది. అన్నింటిని పక్కన పెట్టేసి చివరకు నటించాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సాయి పల్లవి హీరోయిన్‌లా కాకుండా మనింటి అమ్మాయిలా కనిపించిందన్నారు. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నాకే కాదు నాలాంటి అమ్మాయిలకి కూడా. నేను సంతకం చేసిన ప్రతి చిత్ర దర్శకుడు ఒకట్రెండు రోజులు మేకప్ వేసుకోమంటారు. తర్వాత మేకప్ వేస్తే నువ్వు నీలా కనిపించడం లేదు, తీసేయమని చెబుతుంటారు. అందుకే మేకప్‌కి దూరంగా ఉంటూ.. పాత్రకి దగ్గరగా ఉంటా’’
ఆ సందర్భం మరిచిపోలేను..
నేను అల్లు అర్జున్ డ్యాన్సులకి పెద్ద అభిమానిని. అలాంటిది ఆయనే ఓ సందర్భంలో ‘ఫిదా’లోని వచ్చిండే పాట ఎన్నో సార్లు చూశానని, నా డ్యాన్సుని ప్రశంసించడం చెప్పలేనంత సంతోషానిచ్చింది.
తెలుగు చిత్రాలు.. పాత్రలు.. డ్యాన్స్ రికార్డులు
‘ఫిదా’ చిత్రంలో భానుమతిగా, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’లో పల్లవిగా (చిన్ని), ‘పడిపడి లేచె మనసు’లో వైశాలిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది. నాగ చైతన్య సరసన నటించిన ‘లవ్‌స్టోరీ’, రానాతో కలిసి నటించిన ‘విరాటపర్వం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో బిజీగా ఉంది. నాని కథానాయకుడు. తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా ఓ వైపు డబ్బింగ్ చిత్రాలతో, మరోవైపు అదిరిపోయే గీతాలతో ఇక్కడి వారిని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది సాయి పల్లవి. తమిళ చిత్రం ‘మారి 2’లో ధనుష్‌తో కలిసి స్టెప్పులేసి ‘రౌడీ బేబీ’గా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. విడుదలకు ముందే తన అభినయం, నృత్యంతో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఆ కోవలోకి వచ్చేవే.. ‘లవ్‌స్టోరీ’లోని సారంగ దరియా, ‘విరాటపర్వం’లోని కోలో పాటలు. సాయి పల్లవి డ్యాన్సు అంటే యూట్యూబ్ రికార్డులు అనాల్సిందే! అభినయం, నృత్యం మాత్రమే కాదు తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
వ్యాపార ప్రకటనలకు దూరంగా..
మరి ప్రేక్షకుల్లో ఇంత క్రేజ్ ఉన్నా సాయి పల్లవి ఏ వ్యాపార ప్రకటనలో ఎందుకు కనిపించలేదు? అనే సందేహం చాలామందికి రావొచ్చు. దానికి ఇలా సమాధానం చెబుతుందామె.. ‘‘వాణిజ్య ప్రకటనలో నటించడం నాకు ఇష్టం లేదు. స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలైతే పారితోషికం తీసుకోకుండా చేశాను. అది చాలా తక్కువ మందికి తెలుసు’’
సాయి పల్లవి గురించి మరికొన్ని సంగతులు
* సాయి పల్లవి నటి, డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి హర్డిల్స్ ప్లేయర్.
* దేవుడ్ని నమ్ముతుంది.
* నటుడు సూర్య అంటే ఎంతో అభిమానం.
* రన్నింగ్ అంటే సాయి పల్లవికి చాలా ఇష్టం. పాత్ర డిమాండ్ చేస్తే రాకెట్ కంటే వేగంగా పరిగెట్టేస్తా అంటుంటుంది.
* హారర్ చిత్రాలు చూడాలంటే పల్లవికి భయం.
* ఖాళీ సమయంలో డ్రైవింగ్ చేస్తుంది. సీతాకోక చిలుకల్ని పట్టుకుని వదిలేస్తుంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu : అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
-
Ts-top-news News
Heavy Rains: రెడ్ అలర్ట్.. నేటి నుంచి 3 రోజులు అతి భారీవర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)
-
World News
China-Taiwan ఉద్రిక్తతల వేళ.. తైవాన్ కీలక అధికారి అనుమానాస్పద మృతి
-
India News
Varun Gandhi: ఉచిత రేషన్ సరే.. ఆ రూ.10 లక్షల కోట్ల మాటేంటి..?
-
Movies News
Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- Delhi: పోలీసుస్టేషన్లోకి చొరబడి మరీ.. కానిస్టేబుల్‌పై రౌడీ మూక దాడి
- ఈ బాధలు భరించలేకపోతున్నానంటూ అమెరికాలో ప్రవాస భారతీయురాలి ఆత్మహత్య
- CM Kcr: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పంద్రాగస్టు కానుక
- Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
- BAN VS ZIM: బంగ్లా టైగర్స్‌ను బెంబేలెత్తిస్తోన్న జింబాబ్వే..! 9 ఏళ్ల తర్వాత తొలిసారి!
- Tattoos: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్!
- నా మనవరాలు ఏం చేసిందని చంపేశారు..?