Saipallavi: రైతు కూలీగా రౌడీ బేబీ

వెండితెరపై స్టార్‌ నాయికగా మెరుపులు మెరిపిస్తున్నా.. నిజ జీవితంలో నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడుతుంది నటి సాయిపల్లవి. ఆమె తాజాగా ఉగాది పర్వదినం సందర్భంగా రైతు కూలీ అవతారమెత్తింది.

Updated : 04 Apr 2022 13:21 IST

వెండితెరపై స్టార్‌ నాయికగా మెరుపులు మెరిపిస్తున్నా.. నిజ జీవితంలో నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడుతుంది నటి సాయిపల్లవి. ఆమె తాజాగా ఉగాది పర్వదినం సందర్భంగా రైతు కూలీ అవతారమెత్తింది. తన స్టార్‌డమ్‌ను పక్కకు నెట్టి.. అసలు సిసలు రైతు కూలీలా తలకు రుమాల్‌ చుట్టుకొని పొలంలోకి అడుగు పెట్టింది. మిగతా కూలీలతో కలిసి పంట కోత పనుల్లో పాలుపంచుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల   వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు పల్లవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘‘నీలా ఎవరూ ఉండలేరు సాయి పల్లవి’’ అంటూ నటి శ్రద్ధా శ్రీనాథ్‌ పోస్ట్‌ చేసింది. ‘‘నీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్‌’’ అంటూ పలువురు నెటిజన్లు పల్లవిని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. రానా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని