Nani SSR: సాయిపల్లవి ఉగ్రరూపిణై... 

‘ఎంసీఏ’ తర్వాత సాయిపల్లవి, నాని జంటగా నటిస్తోన్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ చిత్రానికి రాహుల్‌ సాంకృత్యాయన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.....

Published : 09 May 2021 15:16 IST

హైదరాబాద్‌: ‘ఎంసీఏ’ తర్వాత సాయిపల్లవి, నాని జంటగా నటిస్తోన్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ చిత్రానికి రాహుల్‌ సాంకృత్యాయన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి సాయిపల్లవి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. బెంగాలీ చీరకట్టులో త్రిశూలం పట్టుకున్న కాళీకాదేవి అవతారంలో దర్శనమిస్తున్నట్లు ఉన్న సాయిపల్లవి లుక్‌ ప్రస్తుతం ప్రతిఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది.

విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. సాయిపల్లవితోపాటు కృతిశెట్టి ఇందులో కథానాయికగా కనిపించనున్నారు. మిక్కీజెమేయర్‌ స్వరాలు అందించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని