Sai Pallavi: త్వరలో అల్లరి పాత్రలో కనిపిస్తా: సాయిపల్లవి
తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా అభిమానించే కథానాయికల్లో సాయిపల్లవి(Sai Pallavi) ముందు వరుసలో ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా అభిమానించే కథానాయికల్లో సాయిపల్లవి (Sai Pallavi) ముందు వరుసలో ఉంటుంది. అందుకే అభిమానులు ఆమెకు ‘లేడీ పవర్‌స్టార్’ అనే బిరుదును కట్టబెట్టేశారు. నటనకు ఆస్కారమున్న, వినూత్న పాత్రలను ఎంచుకుంటున్న ఈ నటనామయూరి అదే వరుసలో ‘గార్గి’(Gargi) చిత్రంలో స్త్రీ ప్రాధాన్యమున్న పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ విశేషంగా అలరిస్తుండగా, ఇంకా ఈ సినిమా విశేషాలను పంచుకోవటానికి ఆమె కూడా మన ముందుకు వచ్చారు. ఆమె మాటల్లో ‘గార్గి’ ఎవరంటే..
ఈ సినిమా చేయటానికి ప్రత్యేక కారణమేంటి?
సాయిపల్లవి: ఈ కథను వినగానే ఎలాగైనా ఈ పాత్రను చేయాలనిపించింది. అందరి జీవితాలను టచ్ చేసే కథ ఇది. ‘వకీల్ సాబ్’, ‘జై భీమ్’లా సమాజానికి ఏదైనా చెప్పే ఆస్కారమున్న పాత్రను ఇందులో చేశా.
అంటే కథ మొత్తం లాపాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందా?
సాయిపల్లవి: అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నాతో సమాంతరంగా ఒక లాయర్ పాత్ర సాగుతుంది. న్యాయం కోసం పోరాడే నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది.
అసలు ‘గార్గి’ టైటిల్ వెనుక అంతరార్థమేమిటి?
సాయిపల్లవి: ‘గార్గి’ మన పురాణాలలో స్త్రీపాధాన్యమున్న పాత్ర పేరు. ఆ పేరుకి న్యాయం చేసేలానే ఈ సినిమాలో గార్గి పాత్ర ఉంటుంది.
ఈ సినిమాలో ఒక స్కూల్ టీచర్ పాత్ర చేశారు కదా?ఎలా అనిపించింది?
సాయిపల్లవి: నేను స్కూల్ లైఫ్‌ని చాలా తక్కువగా ఎంజాయ్ చేశాను. డ్యాన్స్ నేర్చుకోవడానికి అటెండెన్స్ ఇచ్చి వెళిపోయేదాన్ని. అటువంటిది ఈ సినిమాలో టీచర్‌గా నటించాకా వారెంత కష్టపడతారో తెలిసింది.
ముందు ఈ కథ ఐశ్వర్య లక్ష్మీ దగ్గరికి వెళ్తే, ఆమె మీ పేరు ప్రతిపాదించారట?
సాయిపల్లవి: అవును. నిజానికి ఆమె, డైరెక్టర్ గౌతమ్ చంద్రన్ స్నేహితులు. ఆమె ఈ రోల్‌కి సాయిపల్లవి న్యాయం చేస్తుందని చెప్పారట. ఆమె కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. నిజంగా ఇది గొప్ప విషయం. కొన్ని పాత్రలకు న్యాయం చేసే పేర్లను నేనిలాగే ప్రతిపాదించాను.
ఈ సినిమా ట్రైలర్లో స్త్రీ స్వేచ్ఛ గురించి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి..దీనికి మీ సమాధానం?
సాయిపల్లవి: అవును..నిజ జీవితంలో తల్లిదండ్రులతో అమ్మాయిల సంభాషణలు ఎలా ఉంటాయో ఈ డైలాగ్స్ అలానే ఉంటాయి. నిజజీవితంలో పాత్రలానే గర్గి పాత్ర ఉంటుంది.
ఇటీవల అన్యాయంగా కేసుల్లో ఇరికించిన కథలనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు. వాటికన్నా ఈ సినిమాలో ఏంటి ప్రత్యేకం?
సాయిపల్లవి: అసలు ఈ సినిమాలో ఏ వ్యవస్థను మేము ఎవరిని పాయింట్ చేయలేదు. ఒక అమ్మాయికి తనకు వచ్చిన ఆపదను, తనకున్న బంధనాలను దాటి ఎలా
ఎదుర్కొందనే ఈ చిత్ర కథ
విరాటపర్వానికి చాలా కష్టపడ్డారు కదా?ఫలితం నిరాశపరిచిందా?
సాయిపల్లవి: విరాటపర్వం చేసేటప్పుడే నటిగా చాలా సంతృప్తి చెందా. ఆ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అయితే ప్రేక్షకులు ఇచ్చిన తీర్పే నాకు ముఖ్యం.ఏం చేసిన ఆడియెన్స్ ఆదరిస్తారనే చేస్తాను.
రానా ‘గార్గి’ సినిమాను సమర్పిస్తున్నారు కదా? అదెలా?
సాయిపల్లవి: ఒక కాల్ చేశాను ఆయన వెంటనే స్పందించారు. ఆయన గార్గిని ప్రెజెంట్ చేయటం గొప్ప విషయం. తమిళ్ లో సూర్య గారు సమర్పిస్తున్నారు.
మిమ్మల్ని అల్లరి అమ్మాయి పాత్రలో చూసి చాలా రోజులైంది..ఇలా బరువైన పాత్రలే చేయడానికి కారణం?
సాయిపల్లవి: అదేం లేదు.ఒక నటిగా నేను అన్ని పాత్రలను చేయగలనని నిరూపించుకోవాలి కదా..కాని నాకు మిస్సయినట్లు అనిపించింది, త్వరలో మళ్లీ అల్లరిపాత్రలో నటిస్తాను.
ఇటీవల మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై మీ స్పందన?
సాయిపల్లవి: బాధపడ్డాను...నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారనుకున్నాను. నా మాటల్లోని భావాన్ని అర్థం చేసుకుంటే ఎటువంటి వివాదం జరిగి ఉండేది కాదు. నా మాటలను రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరం. ప్రస్తుతం అది ముగిసిపోయింది.
ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు కదా? భవిష్యత్‌లో నిర్మాత, దర్శకురాలిగా ఏమైనా మారాతారా?
సాయిపల్లవి: ప్రస్తుతం అటువంటి ఆలోచనలు లేవు. ఇప్పుడు నన్ను నేను నటిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నా. హిందీ, మరాఠీ భాషల్లోను అవకాశాలు వస్తున్నాయి. కానీ, ముందు మనం చేయగలిగింది చేయాలి కదా.
‘జై భీమ్’ తో భారీ హిట్ కొట్టిన సూర్య ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు కదా? ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కౌట్ అవుతుందా?
సాయిపల్లవి: ఆ సినిమా చేసేటప్పుడు ఆయన ఏ విధంగా కథని నమ్మారో, నేనూ ఒక గొప్ప కథను ప్రేక్షకులకు చూపించబోతున్నాం అని నమ్ముతున్నాను. కచ్చితంగా ఆ నమ్మకం ఈ సినిమాతో నిజమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM