Sai Pallavi: కళరి ఫైట్‌ సీన్‌ చూశారా?

సాయిపల్లవి అయితే, కళ్లతోనే హావభావాలు పలికించింది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి ‘కళరి’ విద్యను ప్రదర్శించే సన్నివేశం ప్రత్యేక ఆకర్షణ.

Published : 05 Jun 2021 23:35 IST

హైదరాబాద్‌: ఫహద్‌ ఫాజిల్‌, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్‌’. వివేక్‌ దర్శకత్వం వహించారు. తాజాగా తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో ఆహా ఓటీటీ వేదికగా విడుదలైంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.

ముఖ్యంగా ఫహద్‌ ఫాజిల్‌, సాయి పల్లవిల నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. సాయిపల్లవి అయితే, కళ్లతోనే హావభావాలు పలికించింది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి ‘కళరి’ విద్యను ప్రదర్శించే సన్నివేశం ప్రత్యేక ఆకర్షణ. తాజాగా ఈ ఫైట్‌ వీడియోను ఆహా అభిమానులతో పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫైట్‌ సీన్‌ మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని