Sai Pallavi: ‘గార్గి’ వచ్చేస్తోంది

ఇటీవలే ‘విరాట పర్వం’తో ప్రేక్షకుల్ని పలకరించింది నటి సాయిపల్లవి. ఆ చిత్రంలో వెన్నెలగా ఆమె కనబరిచిన అభినయానికి సినీప్రియులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ జోష్‌లోనే ఆమె ‘గార్గి’గా అలరించేందుకు  సిద్ధమైంది.

Updated : 04 Jul 2022 07:41 IST

టీవలే ‘విరాట పర్వం’తో(Virataparvam) ప్రేక్షకుల్ని పలకరించింది నటి సాయిపల్లవి (Sai Pallavi). ఆ చిత్రంలో వెన్నెలగా ఆమె కనబరిచిన అభినయానికి సినీప్రియులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ జోష్‌లోనే ఆమె ‘గార్గి’గా(GARGI) అలరించేందుకు  సిద్ధమైంది. గౌతమ్‌ రామచంద్ర(Gautham Ramachandra) తెరకెక్కించిన బహుభాషా చిత్రమిది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నటులు సూర్య - జ్యోతిక విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని జులై 15న  ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ  విషయాన్ని ఆదివారం అధికారికంగా  ప్రకటించారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను నెట్టింట పంచుకున్నారు. న్యాయ వ్యవస్థ చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమాకి ‘96’ ఫేమ్‌ గోవింద్‌ వసంత స్వరాలు సమకూర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని