Sai Pallavi: ‘లేడీ పవర్‌స్టార్‌’ ట్యాగ్‌పై సాయిపల్లవి కామెంట్స్‌

నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ తరచూ ఇంటెన్స్‌ ప్రేమకథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి సాయిపల్లవి (Sai Pallavi). ‘ఫిదా’ (Fidaa) నుంచి ఇటీవల విడుదలైన ‘విరాటపర్వం’ (Virataparvam) వరకూ...

Published : 20 Jun 2022 14:23 IST

హైదరాబాద్‌: నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ తరచూ ఇంటెన్స్‌ ప్రేమకథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి సాయిపల్లవి (Sai Pallavi). ‘ఫిదా’ (Fidaa) నుంచి ఇటీవల విడుదలైన ‘విరాటపర్వం’ (Virataparvam) వరకూ ఆమె చేసిన ప్రతిరోల్‌ తెలుగువారికి ఎంతగానో చేరువైంది. ముఖ్యంగా ‘శ్యామ్‌సింగరాయ్‌’ (Shyam Singha Roy), ‘విరాటపర్వం’ (Virataparvam) సినిమాల్లో ఆమె పోషించిన ప్రేమికురాలి పాత్రలు.. హృదయాలను హత్తుకున్నాయి. దీంతో ఆమె నటనకు ఫిదా అయిన సినీ ప్రియులు.. సాయిపల్లవిని లేడీ పవర్‌స్టార్‌గా అభివర్ణిస్తున్నారు. ఇటీవల ‘విరాటపర్వం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనూ ఇదే ట్యాగ్‌ని కంటిన్యూ చేశారు.

కాగా, తనని లేడీ పవర్‌స్టార్‌గా అభివర్ణించడంపై సాయిపల్లవి తాజాగా స్పందించారు. ‘విరాటపర్వం’ సక్సెస్‌ అయిన నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘పేరుకు ముందు ఇలాంటి ట్యాగ్స్‌ పెట్టుకోవడం కరెక్ట్‌ కాదని భావిస్తుంటాను. అందుకే వీటికి త్వరగా కనెక్ట్‌ కాను. ఇప్పటివరకూ నేను పోషించే పాత్రలు నచ్చడం వల్లే సినీ ప్రియులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్ల ప్రేమను దృష్టిలో ఉంచుకుని నేను మరిన్ని మంచి పాత్రల్లో నటించాలి. ఇలాంటి ట్యాగ్స్‌ని తలకెత్తుకుంటే ఒత్తిడికి గురై.. సరిగ్గా నటించలేను. కాబట్టి నేను సాధారణంగా ఉండటానికే ఇష్టపడతాను’’ అని సాయిపల్లవి వివరించారు.

ఇక, ‘విరాటపర్వం’ విషయానికి వస్తే నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో సిద్ధమైన ప్రేమకథ ఇది. వేణు ఊడుగుల దర్శకుడు. 1990లో జరిగిన వాస్తవ ఘటనలు, వరంగల్‌కు చెందిన తూము సరళ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. రానా (Rana) కీలకపాత్ర పోషించారు. సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ అందుకుంది. సాయిపల్లవి, రానా నటన బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు