Filmfare Awards: ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు.. : సాయిపల్లవి

దక్షిణ భారత చలన చిత్రరంగంలో విశేషంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల్లో ఈ అందాలతారకు రెండు అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఆ అవార్డుల ఫొటోలను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది సాయిపల్లవి.

Updated : 12 Oct 2022 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అద్భుతంగా నటిస్తూ.. నెమలిలా నాట్యం చేస్తూ.. పోషించిన ప్రతి పాత్రకు న్యాయం చేసే నటి సాయిపల్లవి. అందానికి అభినయం తోడైతే ఆమెలాగే ఉంటుందేమో అనిపిస్తుంటుంది. తాజాగా దక్షిణ భారత చలన చిత్ర రంగంలో విశేషంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల్లో ఈ అందాల తారకు రెండు అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఆ అవార్డుల ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది సాయిపల్లవి.

‘‘ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు. ఒకే సంవత్సరం రెండు చిత్రాలకు ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. ఇవి చాలా ప్రత్యేకమైనవి. మంచి పాత్రలు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు దర్శకులకు ధన్యవాదాలు. మీరు చూపించే ప్రేమకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇలాంటి అందమైన పాత్రలు రావాలని కోరుకుంటున్నాను’’ అంటూ అవార్డులు పట్టుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇక ‘లవ్‌స్టోరీ’ సినిమాకుగాను సాయిపల్లవికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డు దక్కగా, ‘శ్యామ్‌సింగ్‌రాయ్‌’లో విమర్శకుల ఉత్తమ నటిగా మరో అవార్డును సొంతం చేసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని