Saipallavi: కూలీగా మారిన స్టార్‌హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌

తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఓ నటి కూలీగా మారి పొలంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్‌గా రాణిస్తున్న ఆమె తమతో కలిసి పనిచేస్తుందా? అని అక్కడే ఉన్న మహిళా కూలీలందరూ ఆశ్చర్యపోయారు.....

Published : 03 Apr 2022 10:40 IST

చెన్నై: తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఓ నటి కూలీగా మారి పొలంలోకి అడుగుపెట్టారు. దీంతో అక్కడే ఉన్న మహిళా కూలీలందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ నటి ఎవరంటే.. సాయిపల్లవి. ‘ప్రేమమ్‌’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ నేచురల్‌ బ్యూటీ ‘భానుమతి సింగిల్‌ పీస్‌’ అంటూ తెలుగు వారికి చేరువై ఇక్కడి వారినీ ‘ఫిదా’ చేసింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ.. తనకు నప్పే కథలు మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇటీవల ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అలరించిన సాయి ప్రస్తుతం షూట్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె రైతుగా అవతారమెత్తి వ్యవసాయ పనులు చేశారు. మిగతా కూలీలతో కలిసి పంట కోత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఫొటోలను సాయిపల్లవి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన పలువురు తారలు ఆమెను మెచ్చుకుంటున్నారు. ‘‘సాయిపల్లవి.. నీలా ఎవ్వరూ ఉండలేరు’’ అని నటి శ్రద్ధా శ్రీనాథ్‌ ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని