Samantha: సామ్‌.. నువ్వు ఏ మాయ చేసావో కానీ..: సాయిధరమ్‌ తేజ్‌

అగ్రకథానాయిక సమంతకు నటుడు సాయిధరమ్‌ తేజ్‌ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. సామ్‌ అంటే తనకెంతో ఇష్టమని ఆయన ఇప్పటికే పలు పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్స్‌పై చెప్పారు. ముఖ్యంగా ఆమె వెండితెరకు పరిచయమైన ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి తాను..

Published : 28 Apr 2022 12:35 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంతకు నటుడు సాయిధరమ్‌ తేజ్‌ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. సామ్‌ అంటే తనకెంతో ఇష్టమని ఆయన ఇప్పటికే పలు పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్స్‌పై చెప్పారు. ముఖ్యంగా ఆమె వెండితెరకు పరిచయమైన ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి తాను మనసు పారేసుకున్నానని ఎన్నోసార్లు తెలిపారు. కాగా, తాజాగా సాయితేజ్‌ మరోసారి సమంతపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. గురువారం సమంత పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయన కాస్త విభిన్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

‘‘జెస్సీ.. నువ్వు ఏ మాయ చేశావో కానీ.. ఏటో వెళ్లిపోయింది మనసు..  హ్యాపీ బర్త్‌డే సమంత.. నిన్ను అమితంగా ఇష్టపడే అభిమాని’’ అంటూ సామ్‌ నటించిన సినిమా పేర్లు ఉపయోగించి సాయి విషెస్‌ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాయితేజ్‌తోపాటు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు సైతం సమంతకు విషెస్‌ తెలిపారు. ఈ ఏడాది సమంతకు అన్ని విధాలుగా కలిసి రావాలని కోరుకున్నారు. టాలీవుడ్‌ దర్శకురాలు నందినిరెడ్డి, హన్సిక, రష్మిక, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, కీర్తిసురేశ్‌, త్రిష, కంగనా రనౌత్‌, వరుణ్‌ ధావన్‌, వెన్నెల కిషోర్‌, ఉపాసనతోపాటు పలువురు డైరెక్టర్లు, చిత్ర నిర్మాతలు సైతం సామ్‌కు విషెస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని