Saif Ali Khan: ‘మహాభారతం’లోనూ నటించాలని ఉంది: సైఫ్‌ అలీఖాన్‌

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) తన మనసులోని మాటను బయటపెట్టారు. భారతీయ ఇతిహాసాల్లో ఒక్కటైన రామాయణంలో నటించిన ఆయన ‘మహాభారతం’లోనూ నటించాలని ఉందని తెలిపారు.

Updated : 07 Oct 2022 13:35 IST

ముంబయి: కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా వరుస సినిమాల్లో నటిస్తోన్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) తన మనసులోని మాటను బయటపెట్టారు. భారతీయ ఇతిహాసాల్లో ఒక్కటైన రామాయణంలో ఇప్పటికే నటిస్తున్న ఆయన ‘మహాభారతం’లోనూ నటించాలనుందని తెలిపారు. ‘విక్రమ్‌ వేద’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్‌.. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించారు. ‘‘హాలీవుడ్‌ చిత్రం ‘లార్డ్స్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ మాదిరిగా ఎవరైనా మహాభారతాన్ని భారీ చిత్రంగా తెరకెక్కిస్తే.. అలాంటి ప్రాజెక్ట్‌లో నటించాలనుకుంటున్నా. ‘కచ్చే ధాగే’ సినిమా అప్పటి నుంచే అజయ్‌దేవ్‌గణ్‌, నేనూ మహాభారతం ప్రాజెక్ట్‌ గురించి చర్చించుకుంటున్నాం. మా జనరేషన్‌కు ఇదొక డ్రీమ్. ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుకుంటున్నారు. బాలీవుడ్‌, దక్షిణాది చిత్ర పరిశ్రమ కలిసి ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలి’’ అని పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సైఫ్‌ ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో సైఫ్‌ రావణాసురుడి పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. రావణాసురుడిగా సైఫ్‌ లుక్‌ బాగోలేదని వాళ్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని