Sai Pallavi: తెలుగు హీరోతో హిందీ సినిమా?

‘ఫిదా’ చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ సాయిపల్లవి. తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడీ ఈ అందాన్ని బాలీవుడ్‌లోనూ చూపేంచేందుకు రెడీ అయిందని చెప్పుకుంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ‘ఛత్రపతి’ సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Published : 12 May 2021 21:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ సాయిపల్లవి. తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడీ నటి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిందని చెప్పుకుంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ‘ఛత్రపతి’ సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా సాయిపల్లవిని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఆమెతో సంప్రందింపులు జరుపుతున్నారట. అయితే దీనిపై మరిన్ని విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. సాయిపల్లవి నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’, దగ్గుబాటి రానాతో ‘విరాటపర్వం’ చేసింది. ఈ రెండు సినిమా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక నానితో కలిసి ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని