Saiyami Kher: ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హేళన చేశారు...
తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది హేళన చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది సయామీ ఖేర్(Saiyami Kher).
హైదరాబాద్: తెలుగులో ‘రేయ్’ చిత్రంతో వెండితెరకు అరంగేట్రం చేసిన బ్యూటీ సయామీ ఖేర్(Saiyami Kher). ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా చెప్పింది. బాడీ షేమింగ్‌కు గురయ్యానంటూ ఓ ప్రముఖ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోజులను గుర్తుచేసుకుంది.
‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది నన్ను హేళన చేశారు. నా స్కిన్ గురించి అసభ్యంగా మాట్లాడేవారు. నేను వాటిని పట్టించుకోలేదు. కానీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందుకే ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నారు. ఇక దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమలకు గల వ్యత్యాసం గురించి మాట్లాడుతూ..‘ఈ రెండు పరిశ్రమలకు భాషాపరమైన తేడా తప్ప మరేది లేదు. నేను నాగార్జునతో ఇటీవల నటించాను. ఆ సినిమాకు పనిచేసిన వారిలో అమెరికా, ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు’ అని చెప్పింది సయామీ ఖేర్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం
-
Ap-top-news News
Andhra News: ఇసుక కోసం.. నదిలోనే అడ్డంగా దారి
-
Politics News
Nitish Kumar: కేసీఆర్ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: నీతీశ్‌కుమార్
-
India News
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్’!
-
Ap-top-news News
Andhra News: మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా..సెల్ఫీ వీడియో తీసి యువరైతు అదృశ్యం