దక్షిణాది తారలకు స్కిన్‌ షో చేసే ధైర్యం లేదన్న నెటిజన్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నటి

స్కిన్‌ షో గురించి అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన నెటిజన్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు నటి సాక్షి అగర్వాల్‌ (Sakshi Agarwal).  

Updated : 08 Jun 2023 17:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాది తారలను ఉద్దేశిస్తూ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ఓ నెటిజన్‌కు కోలీవుడ్‌ నటి సాక్షి అగర్వాల్‌ (Sakshi agarwal) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. దక్షిణాది తారలు కేవలం తమ టాలెంట్‌నే నమ్మకుంటారని చెప్పారు. స్కిన్‌ షో చేయాల్సిన అవసరం ఇక్కడి వాళ్లకు లేదని చురకలు అంటించారు. ఇంతకీ సాక్షి అగర్వాల్‌కు ఆగ్రహం తెప్పించేలా సదరు నెటిజన్‌ ఏమన్నారంటే..?

సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సాక్షి అగర్వాల్‌ (Sakshi agarwal) తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అందులో ఆమె వెస్ట్రన్‌ దుస్తుల్లో మెరిసిపోయారు. వీటిని చూసిన ఓ నెటిజన్‌.. ‘‘లో దుస్తులు లేకుండా ఫొటోషూట్‌లో పాల్గొనే ధైర్యం దక్షిణాది తారలకు లేదు’’ అని అభ్యంతరకర రీతిలో కామెంట్‌ చేశాడు. దీనిపై సాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక సౌత్‌ ఇండియన్‌ నటిగా నటన విషయంలో మేము మా టాలెంట్‌ను నమ్ముకుంటాం. స్కిన్‌ షోను కాదు. అంతేకాదు, కళకు స్కిన్‌ షోతో అవసరం లేదు’’ అని ఘాటుగా బదులిచ్చారు. సాక్షి పెట్టిన కామెంట్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన సాక్షి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే ఆమె వెండితెరవైపు అడుగులు వేశారు. ‘కాలా’, ‘విశ్వాసం’, ‘టెడ్డీ’, ‘కుట్టీ స్టోరీ’ ‘4 సారీ’ వంటి చిత్రాల్లో ఆమె కీలకపాత్రలు పోషించారు. ‘బిగ్‌బాస్‌-3’ (తమిళం)లోనూ ఆమె పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు