Salaar Vs Dunki: షారుక్‌ ‘డంకీ’కి పోటీగా ప్రభాస్‌ ‘సలార్‌’.. మీమ్స్‌ మామూలుగా లేవు!

Salaar Vs Dunki: ప్రభాస్‌ ‘సలార్‌’ను క్రిస్మస్‌కు తీసుకువస్తారని టాక్‌ నడుస్తుండటంతో షారుక్‌ అభిమానులు ట్విటర్‌ వేదికగా ట్రోల్స్‌ మొదలు పెట్టారు. వారికి దీటుగా ప్రభాస్‌ అభిమానులు సైతం స్పందిస్తున్నారు.

Updated : 26 Sep 2023 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రాల్లో ‘సలార్‌’ (Salaar) ఒకటి. ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ఈ వారం విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు డిసెంబరు 22న తీసుకురానున్నట్లు సమాచారం.

క్రిస్మస్‌ హాలీడేస్‌తో పాటు, సంక్రాంతి వరకూ మరో సినిమా విడుదలయ్యే అవకాశం ఉండకపోవడంతో ‘సలార్‌’కు కలిసొస్తుందని చిత్ర బృందం భావిస్తోందట. కానీ, ఒకే ఒక్క సినిమా ‘సలార్‌’ను ఢీకొనబోతోంది. అదే షారుక్‌ ‘డంకీ’ (Dunki). రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకుడు. ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద రెండుసార్లు ‘పఠాన్‌’, ‘జవాన్‌’లతో రూ.1000కోట్లు వసూలు చేసి, మరోసారి తాను కలెక్షన్‌ కింగ్‌ఖాన్‌ అనిపించుకున్నారు షారుక్‌. ‘సలార్‌’ డిసెంబరు 22న వస్తుందన్న ప్రచారం మొదలైన దగ్గరి నుంచి షారుక్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా మీమ్స్‌తో ముంచెత్తుతున్నారు.

ప్రభాస్‌ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!

కొన్ని రోజులు కిందట విడుదల చేసిన ‘సలార్‌’ గ్లింప్స్‌లో ప్రభాస్‌ పాత్రను డైనోసార్‌తో పోల్చారు. మరోవైపు షారుక్‌ను ఆయన అభిమానులు కింగ్‌ఖాన్‌ అని పిలుచుకుంటారు. ఈ రెండు పేర్లు కలిసేలా ‘కింగ్‌ కాంగ్‌’ మూవీలో డైనోసార్‌తో భారీ గొరిల్లా పోరాడే సీన్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు. ఆ యుద్ధంలో డైనోసర్‌ను గొరిల్లా తుక్కు తుక్కు కింద కొడుతుంది. ఈ వీడియోను పంచుకుంటూ డిసెంబరు 22న ‘సలార్‌’ వస్తే ఇదే పరిస్థితి అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ అభిమానులు సైతం ఏమీ తగ్గట్లేదు. ‘డంకీ’కి ఇప్పటివరకూ ఎలాంటి ప్రచారం లేకపోవడంతో కావాలనే ‘సలార్‌’ను జత చేసి, వాళ్ల సినిమాకు ప్రచారం చేసుకుంటున్నారని సమాధానం ఇస్తున్నారు. మరి తాజాగా ఎక్స్‌(ట్విటర్‌)లో వైరల్‌ అవుతున్న మీమ్స్‌ మీరూ చూసేయండి.















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు