Adipurush: ‘ఆదిపురుష్‌’తో ‘సలార్‌’ గ్లింప్స్‌?

ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘సలార్‌’. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 27 May 2023 12:16 IST

ప్రభాస్‌ (Prabhas) - ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘సలార్‌’ (Salaar). హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 28న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. జూన్‌ 16న రానున్న ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రంతో పాటే ‘సలార్‌’ ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన ప్రతినాయక పాత్రను సౌరవ్‌ లోకేష్‌ పోషిస్తున్నట్లు తెలిసింది. అలాగే విశాల్‌ ‘పొగరు’ చిత్రంలో ప్రతినాయికగా నటించిన శ్రియా రెడ్డి ఈ సినిమాలో ఓ శక్తిమంతమైన పాత్రలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్‌, ఛాయాగ్రహణం: భువన్‌ గౌడ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని