salaar: ‘సలార్‌’ మరో షెడ్యూల్‌కు రెడీ అవుతున్నారా?

‘కేజీయఫ్‌2’ విజయంతో మంచి జోరుమీదున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Published : 18 Apr 2022 15:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కేజీయఫ్‌2’ విజయంతో మంచి జోరుమీదున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, హిందీలో తన హవా చూపిస్తోంది. ఈ క్రమంలో అందరి దృష్టి ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సలార్‌’పైనే పడింది.  ప్రశాంత్‌ నీల్‌ తమ అభిమాన హీరోను ఎలా చూపిస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తదుపరి షెడ్యూల్‌కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో చిత్రీకరణ చేయనున్నారట. సింహభాగం ఈ షెడ్యూల్‌లోనే పూర్తి చేయాలని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా టాకీ పార్ట్ అంతా పూర్తి చేస్తే, వేసవి తగ్గాక, యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారట. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్‌ చిత్రంగా ‘సలార్‌’ తెరకెక్కనుంది.  బొగ్గు గనుల నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని