Godfather: థియేటర్‌లోనే టపాసులు కాల్చిన సల్మాన్ ఫ్యాన్స్.. పరుగులు తీసిన ప్రేక్షకులు
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్’ (Godfather) సల్మాన్‌ఖాన్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా నార్త్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ముంబయి: చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన ‘గాడ్‌ఫాదర్’ (Godfather) బాలీవుడ్‌లో మంచి టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రీనింగ్‌లో సల్మాన్ ఖాన్ (Salman Khan) అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్‌లోనే టపాసులు కాల్చి హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మహారాష్ట్రలోని మాలేగావ్‌లోని ఓ థియేటర్‌లో ‘గాడ్‌ఫాదర్’ ప్రదర్శిస్తున్నారు. సినిమాలో ‘తార్‌మార్...’ పాట ప్లే అవుతోన్న సమయంలో కొంతమంది అభిమానులు థియేటర్‌లోనే టపాసులు కాల్చారు. దీంతో ప్రేక్షకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ వీడియోలను చూసిన నెటిజన్లు.. ‘‘ఇదెక్కడి మాస్ సామీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి పనులు మంచివి కావు అని కామెంట్స్ చేస్తున్నారు.
సల్మాన్ నటించిన ‘అంతిమ్’ విడుదలైనప్పుడూ అభిమానులు ఇలాంటి చర్యలకే పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సల్మాన్.. ఇలాంటి పనులు వద్దని అప్పట్లో విజ్ఞప్తి చేశారు. కానీ అభిమానులు వినకుండా ఇప్పుడు ‘గాడ్‌ఫాదర్’ విషయంలోనూ అదే పని చేశారు. ఇక ‘లూసిఫర్’కు రీమేక్ అయిన ‘గాడ్‌ఫాదర్’ సల్మాన్ ఖాన్ మసూం భాయ్ పాత్రలో ప్రత్యేక ఆర్షణగా నిలిచారు. దీంతో ఈ చిత్రానికి బాలీవుడ్‌లోనూ మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Ap-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!