Salman khan: చేసేదేముంది సెట్‌ను కూల్చేయడమే!

కరోనా కష్టాలు ఏ సినిమాను వదలడం లేదు. భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. సినిమా చిత్రీకరణ పూర్తయితే విడుదల ఏదోలా చేసుకోవచ్చు. పూర్తి కాకపోతే కరోనా తగ్గాకా చెయ్యొచ్చు....

Published : 04 Jun 2021 10:04 IST

మంబయి: కరోనా కష్టాలు ఏ సినిమాను వదలడం లేదు. భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. సినిమా చిత్రీకరణ పూర్తయితే విడుదల ఏదోలా చేసుకోవచ్చు. పూర్తి కాకపోతే కరోనా తగ్గాకా చెయ్యొచ్చు. అంతేకానీ కరోనా సెకండ్‌ వేవ్‌కు ముందు సెట్‌ వేసి ఎప్పటికి షూటింగులు మొదలవుతాయో తెలియని పరిస్థితుల్లో ఉంటే మాత్రం పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నట్టే. ఇప్పుడు అలాంటి పరిస్థితే ‘టైగర్‌ 3’ సినిమాకి వచ్చింది. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో సెట్స్‌పైకి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కత్రినాకు కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో చిత్రీకరణ ఆగింది. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఈ సినిమా కోసం గుర్గావ్‌లో ప్రత్యేకంగా సెట్‌ను తీర్చిదిద్దారు. ఆ సెట్‌ మొన్నటి తౌక్టే తుపాను దెబ్బకు పాక్షికంగా దెబ్బతింది. ఇప్పుడేమో వర్షాలు మొదలయ్యాయి. చిత్రీకరణలకు అనుమతి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే ఈ సెట్‌ను కూల్చేస్తున్నారట. అనుమతులు వచ్చి చిత్రీకరణలు మొదలయ్యాక తిరిగి కొత్తగా సెట్‌ను నిర్మించుకోవచ్చనే ఆలోచనలో నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ‘టైగర్‌ 3’ చిత్రబృందంలోని 300 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే సెట్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉంది చిత్రబృందం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని