Salman Khan: సోదరుని కొడుకుతో కలిసి సల్మాన్‌ రష్యాలో..

కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ యమా బిజీ అయిపోయాడు. కొడుకు నిర్వాణ్‌తో కలిసి రష్యా వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నాడు.

Published : 28 Aug 2021 23:26 IST

ముంబయి: కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ యమా బిజీ అయిపోయాడు. సోదరుని కుమారుడు నిర్వాణ్‌తో కలిసి రష్యా వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం టైగర్‌-3 ప్రస్తుతం రష్యాలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా తన కొడుకు, తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ తనయుడు నిర్వాణ్‌ఖాన్ తో రష్యాలో దిగిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. కాగా  నిర్వాణ్‌ ఈ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ నిర్మిస్తున్న ఈ టైగర్‌-3.. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్‌గా రాబోతుంది. కత్రినా ఇందులో సల్మాన్‌కి జోడిగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఫొటోలు గతంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.  అందులో పూర్తిగా బ్రౌన్‌ రంగు గెడ్డంతో గుర్తుపట్టలేనంతగా సల్మాన్‌ కనిపించాడు. హీరోగా గుర్తింపు పొందిన ఇమ్రాన్‌హష్మి ఈ చిత్రంతో విలన్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. మనీష్‌ శర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడు ప్రీతమ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని