గణపతి పూజలో పాల్గొన్న సల్మాన్ ఖాన్‌‌..కత్రినా-విక్కీ కౌశల్‌ జంటకు హారతి

బాలీవుడ్ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్(‌Salman Khan) వినాయక చవితి రోజున గణపతి పూజలో పాల్గొన్నారు. తన సోదరి అర్పితాఖాన్(Arpita Khan)‌, ఆయుష్‌ శర్మ(Aayush Sharma) ఇంట్లో జరిగిన పూజకి హాజరైన సల్మాన్‌ హారతిస్తూ, భజన చేస్తూ...

Published : 02 Sep 2022 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్(‌Salman Khan) వినాయక చవితి రోజున గణపతి పూజలో పాల్గొన్నారు. తన సోదరి అర్పితాఖాన్(Arpita Khan)‌, ఆయుష్‌ శర్మ(Aayush Sharma) ఇంట్లో జరిగిన పూజకి హాజరైన సల్మాన్‌ హారతిస్తూ, భజన చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఈ పూజకి సల్మాన్‌తో పాటు కత్రినాకైఫ్‌(Katrina Kaif)-విక్కీ కౌశల్‌(Vicky Kaushal), జెనీలియా-రితేశ్‌దేశ్‌ముఖ్‌లు పాల్గొన్నారు. సోదరి ఆహ్వానం మేరకు పూజకు విచ్చేసిన సల్మాన్‌, గణపతికి హారతిచ్చారు.  ఈ వీడియోను తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి తన అభిమానులకు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సల్మాన్‌ పూజలో పాల్గొన్న చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రతి సంవత్సరం అర్పితా-ఆయుష్‌ శర్మ ఇంట్లో జరిగే పూజకు సల్మాన్‌ హాజరవుతారు. అర్పితాఖాన్‌ సల్మాన్‌ దత్తత సోదరి. ఆమెకు 2014లో ఆయుష్‌ శర్మతో వివాహం జరిగింది. రాజకీయ  కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయుష్‌ శర్మ 2018లో విడుదలైన ‘లవ్‌ యాత్రి’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇది తెలుగు చిత్రం దేవదాసు(2006)కి రీమేక్‌. ఇంకా 2021లో విడుదలైన సల్మాన్‌ చిత్రం ‘అంతిమ్‌’లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్‌’(Godfather) చిత్రంలో కీలకపాత్ర పోషించారు. అక్టోబర్‌ 5న గాడ్‌ఫాదర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) చిత్రం పఠాన్‌(Pathaan)లో కూడా సల్మాన్‌ అతిథి పాత్ర పోషించారు. ఇంకా టైగర్‌ 3, కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌ లాంటి చిత్రాలు సల్మాన్‌ చేతిలో ఉన్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని