Tiger 3: ‘టైగర్‌ - 3’ రిలీజ్‌ డేట్‌ చెప్పిన సల్మాన్‌

తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను సల్మాన్‌ఖాన్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘టైగర్‌ - 3’ రిలీజ్‌ డేట్‌ని ఆయన ప్రకటించారు.

Published : 15 Oct 2022 14:10 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్స్ సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), కత్రినా కైఫ్‌ (Katrina Kaif) జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). వీరిద్దరి కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌ ఇది. మనీశ్‌ శర్మ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సల్మాన్‌ ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్‌ షేర్‌ చేశారు. హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, సల్మాన్‌ ప్రస్తుతం.. ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’లో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని