SalmanKhan: రితేష్‌ దర్శకత్వంలో సల్మాన్‌?

బాలీవుడ్‌ కథానాయకులు సల్మాన్‌ఖాన్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌ల మధ్య మంచి దోస్తీ ఉంది. ఈ ఆఫ్‌స్క్రీన్‌ బంధం ఆన్‌స్క్రీన్‌కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated : 24 Jun 2022 09:10 IST

బాలీవుడ్‌ కథానాయకులు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), రితేష్‌ దేశ్‌ముఖ్‌ల(Riteish Deshmukh) మధ్య మంచి దోస్తీ ఉంది. ఈ ఆఫ్‌స్క్రీన్‌ బంధం ఆన్‌స్క్రీన్‌కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రితేష్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘వేద్‌’ (Ved) అనే మరాఠీ చిత్రంలో సల్మాన్‌ ఓ అతిథి పాత్రలో నటించనున్నట్టు సమాచారం. సల్మాన్‌ ప్రస్తుతం ‘కభీ ఈద్‌ కభీ దివాలీ’ (Kabhi Eid Kabhi Diwali) షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ షెడ్యూల్‌ ముగియగానే నేరుగా ముంబయి వెళ్లి జూన్‌ 25, 26 తేదీల్లో వేద్‌ పాట చిత్రీకరణలో పాల్గొననున్నట్టు తెలిసింది. జెనీలియా డిసౌజా, జియా శంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12న విడుదలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని