సల్మాన్‌ వెబ్‌ సిరీస్‌!

ఏంటి? వెబ్‌ సిరీస్‌లో సల్మాన్‌ నటిస్తున్నాడా? అని ఆశ్చర్య పోతున్నారా? కాదండి బాబు.. సల్మాన్‌ఖాన్‌ వెబ్‌  సిరీస్‌లు నిర్మించనున్నారు. ‘‘విశాల భారతదేశంలో ఎన్నో గొప్ప

Published : 02 Oct 2020 00:51 IST

ముంబయి: ఏంటి? వెబ్‌ సిరీస్‌లో సల్మాన్‌ నటిస్తున్నాడా? అని ఆశ్చర్య పోతున్నారా? కాదండి బాబు.. సల్మాన్‌ఖాన్‌ వెబ్‌  సిరీస్‌లు నిర్మించనున్నారు. ‘‘విశాల భారతదేశంలో ఎన్నో గొప్ప క్రీడలు మరుగున పడ్డాయి. వాటిని వెలికి తీసి, అందులోని ప్రతిభావంతులకు ప్రాచుర్యం కల్పించడానికి సల్మాన్‌ ఈ వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నార’’ని సన్నిహితులు చెబుతున్నారు.

‘‘లాక్‌డౌన్‌తో చాలా రోజులు విశ్రాంతి తీసుకున్న సల్మాన్‌  నూతన మార్గంలో ప్రయాణించడానికి అన్ని ఏర్పాట్లు చేసు   కుంటున్నారు. అందులో భాగంగానే ఈ వెబ్‌ సిరీస్‌ల నిర్మాణానికి ముందుకొచ్చినట్లు’’ తెలిపారు. ప్రస్తుతం పరిశోధన, స్క్రిప్ట్‌ పనులు నడుస్తున్నాయి. 2021లో చిత్రీకరణకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అక్టోబర్‌ 2 నుంచి సల్మాన్‌ ‘రాధే’ షూటింగ్‌లో పాల్గొననున్నారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని