Cinema News: షారుఖ్‌ని కాపాడే సల్మాన్‌

షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘పఠాన్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం తుది చిత్రీకరణలో ఉంది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.....

Updated : 26 May 2021 10:20 IST

ముంబయి: షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘పఠాన్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం తుది చిత్రీకరణలో ఉంది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో హీరో సల్మాన్‌ ఖాన్‌ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. దీంట్లో ఆయన షారుఖ్‌ స్నేహితుడిగా టైగర్‌ పాత్రలో దర్శనమివ్వనున్నారని తాజా సమాచారం. ఓ విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో షారుఖ్‌కి ఒక రష్యన్‌ గన్‌ మాఫియాకి ఓ భారీ పోరాట ఘట్టం ఉంది. ఆ ఎపిసోడ్‌లోనే షారుఖ్‌ని రక్షించే స్నేహితుడిగా సల్మాన్‌ పాత్ర తెరకు పరిచయం కానుందట. దాదాపు 20నిమిషాల పాటు ఆయన తెరపై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సినిమాలో ఆయన పరిచయ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటాయని చిత్ర సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ చిత్ర క్లైమాక్స్‌ను దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహంలపై దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో చిత్రీకరించారు. ఇప్పటికే 70శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన చిత్రీకరణను రష్యాలో పూర్తి చేయాల్సి ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే చిత్ర బృందం అక్కడికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని