Salman Khan: ప్రేమ నాకు కలిసి రాదు.. రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై సల్మాన్‌ వ్యాఖ్యలు

తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) స్పందించారు. ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రేమ గురించి మాట్లాడారు.

Published : 29 Apr 2023 01:24 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. తన కోస్టార్‌తో ఆయన ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై సల్మాన్‌ స్పందించారు. తనకు ప్రేమ కలిసిరాదని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతానికి తాను అందరికీ భాయ్‌నే అని చెప్పిన సల్మాన్‌.. ‘‘నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను జాన్‌ అని పిలిస్తే బాగుండు అని అనుకుంటాను. అయితే.. ఆమె కూడా నన్ను భాయ్‌ అనే పిలుస్తుంది. నేను ఏం చేసేది?’’ అని నవ్వులు పూయించారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ ఈద్‌ సందర్భంగా ఇటీవల విడుదలైంది. పూజాహెగ్డే కథానాయిక. ఫర్హద్‌ సమ్జీ దర్శకుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. అయితే, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పూజాహెగ్డే - సల్మాన్‌ మధ్య రిలేషన్‌ మొదలైందంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ పూజా స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని