Salman Khan: సల్మాన్‌ సోదరి ఇంట్లో చోరీ.. ఇంటి దొంగను పట్టుకున్న పోలీసులు

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) సోదరి అర్పితాఖాన్‌ నివాసంలో చోరీ జరిగింది.

Published : 18 May 2023 13:42 IST

ముంబయి: సెలబ్రిటీల నివాసాల్లో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య, ఏసుదాసు కుమారుడు విజయ్‌ ఏసుదాసు ఇళ్లల్లో జరిగిన చోరీలను మర్చిపోక ముందే తాజాగా మరో సెలబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) సోదరి అర్పితా ఖాన్‌ ఇంట్లో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వివరాలు బయటకు వచ్చాయి. ఖర్‌లోని తన నివాసంలో చోరీ జరిగిందని అర్పిత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేకప్‌ బాక్సులో పెట్టిన రూ.5లక్షలు విలువైన వజ్రపు చెవి దిద్దులు కనిపించడం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే రోజు సాయంత్రం అర్పిత ఇంట్లో పనిచేస్తోన్న సందీప్‌ హెగ్డే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో అతడి ఇంటిని సోదా చేయగా అవి దొరికాయని పోలీసులు పేర్కొన్నారు. సుమారు నాలుగు నెలల నుంచి అతడు ఇక్కడ పనిచేస్తున్నాడని వారు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని