salman khan:  25వేలమందికి ఆర్థిక సాయం

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం వల్ల సినిమాలు వాయిదా పడటంతో సినీ పరిశ్రమలోని వేతన కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో వాళ్లకు ఆర్థిక సాయం చేయడానికి సల్మాన్‌ఖాన్‌ ముందకు వచ్చారు.

Published : 07 May 2021 19:47 IST

ముంబయి: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం వల్ల సినిమాలు వాయిదా పడటంతో సినీ పరిశ్రమలోని రోజువారీ కార్మికుల కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో వాళ్లకు ఆర్థిక సాయం చేయడానికి సల్మాన్‌ఖాన్‌ ముందుకు వచ్చారు. సినీ పరిశ్రమలో పనిచేసే దాదాపు 25వేల మందిదినసరి వేతన కార్మికులకు రూ.1,500 చొప్పున నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. ఇందుకోసం ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ ఇండియన్‌ సినీ ఎంప్లాయీస్‌ (FWICE)ను సంప్రదించి కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. కాగా గతంలో కర్ణాటకకు చెందిన 18 ఏళ్ల అబ్బాయి తన తండ్రి కొవిడ్‌-19తో మరణించగా.. సాయం చేమని ట్విటర్‌ ద్వారా సల్మాన్‌ను కోరాడు. వెంటనే సల్మాన్‌ స్పందించి, ఆ అబ్బాయి కుటుంబానికి కావలసిన ఆహార సామాగ్రి అందిచారు. అతని చదువుకు కావల్సిన సదుపాయాలు సమకూర్చారు. అలాగే సల్మాన్‌ ఖాన్‌, యువసేన లీడర్‌ రాహుల్‌ ఎస్‌ కనాల్‌ కలిసి బీయింగ్‌ హంగ్రీ ఫుడ్‌ ట్రక్స్‌ ద్వారా రోజూ ముంబయిలోని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి, హోం ఐసోలేషన్లో ఉన్నవాళ్లకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని