Salman khan: చిరంజీవి సినిమా కోసం రంగంలోకి సల్మాన్‌?

అగ్ర కథానాయకుడు చిరంజీవి వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఆయన కీలక పాత్రలో మోహన్‌రాజా తెరకెక్కిన పొలిటికల్‌

Published : 11 Jan 2022 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఆయన కీలక పాత్రలో మోహన్‌రాజా తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిలర్‌ ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా, ఇందులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మాతృకలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌ చేస్తుండటం విశేషం.

కాగా, త్వరలోనే ఈ చిత్ర సెట్స్‌లోకి సల్మాన్‌ అడుగుపెట్టనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. కరోనా కారణంగా ఆయన నటిస్తున్న ‘టైగర్‌3’ చిత్రీకరణ వాయిదా పడింది. దీంతో ఆ డేట్స్‌ను ‘గాడ్‌ఫాదర్‌’ కోసం కేటాయించనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఐదు నుంచి ఏడు రోజుల పాటు సల్మాన్‌ షూటింగ్‌లో పాల్గొంటారట. సినిమా చిత్రీకరణలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా ఉంటే వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ‘గాడ్‌ఫాదర్‌’లో చిరంజీవి, నయనతార, సత్యదేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని