Published : 09 Apr 2022 01:45 IST

salman khan: నిర్మాత ఔట్‌.. దర్శకుడిగా సల్మాన్‌ ఖాన్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ త్వరలోనే మెగాఫోన్‌ పట్టనున్నాడని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సల్మాన్‌ సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని, అందుకు రంగం సిద్ధమైందని సమాచారం. ఈ హీరో తన సొంత బ్యానర్‌లో ‘కబీ ఈద్ కబీ దివాలి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న సాజిద్‌ నదియావాలా ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఏకైక నిర్మాతగా ఉన్న సల్లూ భాయ్‌ దర్శకత్వ బాధ్యతలను కూడా భుజాలకెత్తుకోనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఫర్హాద్‌ సమ్‌జీ కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తాడని అంటున్నారు. సల్మాన్‌ జోక్యం కారణంగానే సంజయ్‌లీలా భన్సాలీతో విభేదాలు తలెత్తాయని ఫలితంగా వీరిద్దరి ‘ఇన్షా అల్లా’ సినిమా అర్ధాంతరంగా నిలిచిపోయిందని సమాచారం. మరోసారి తన తాజా సినిమాకు ఇదే సమస్య ఎదురుకావడంతో నేరుగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయించుకున్నాడట. 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని