Salman Khan: బన్నీకి థ్యాంక్స్‌ చెప్పిన సల్మాన్‌

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ థ్యాంక్స్‌ చెప్పారు. సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధే’లో ‘దువ్వాడ జగన్నాథం’లోని ‘సీటీమార్‌’ పాటను రీక్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే....

Updated : 26 Apr 2021 14:30 IST

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ థ్యాంక్స్‌ చెప్పారు. సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధే’లో ‘దువ్వాడ జగన్నాథం’లోని ‘సీటీమార్‌’ పాటను రీక్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సాంగ్‌ని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా, ‘సీటీమార్‌’ సాంగ్‌ విడుదలైన సందర్భంగా బన్నీని ప్రశంసిస్తూ సల్మాన్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘సీటీమార్‌’ సాంగ్‌ మాకు అందించినందుకు థ్యాంక్స్‌ బన్నీ. డీజే సినిమాలోని ఈ పాటలో నీ డ్యాన్స్‌, స్టైల్‌ నాకు ఎంతగానో నచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నువ్వు సూపర్‌. లవ్‌ యూ బ్రదర్‌’ అని సల్మాన్‌ ట్వీట్‌ చేశారు.

ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్‌ఖాన్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. దిశాపటానీ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. మరోవైపు ‘డీజే’ కోసం దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఆ బాణీని ‘రాధే’ కోసం పునఃసృష్టించాలని కథానాయకుడు సల్మాన్‌ వ్యక్తిగతంగా కోరారట.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని