Published : 30 Mar 2022 18:13 IST

Samantha: బాలీవుడ్‌ నటుడి ఛాలెంజ్‌.. వావ్‌ అనిపించిన సమంత!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ యువ నటుడు టాలీవుడ్‌ నటి సమంతకు ఓ సవాల్‌ విసిరాడు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత.. నెటిజన్లతోపాటు సినీ ప్రముఖులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. తన వర్కౌట్స్‌తో వావ్‌ అనిపించింది. ఆ సవాల్‌ విసిరిన నటుడెవరో కాదు కండల వీరుడిగా పేరొందిన టైగర్‌ ష్రాఫ్‌. ఇంతకీ ఆ ఛాలెంజ్‌ ఏంటంటే.. ‘అటాక్‌ ఛాలెంజ్‌’. ఏం చేయాలంటే.. జిమ్‌లో చెమటోడ్చి, ఇతరుల్లో స్ఫూర్తినింపేందుకు ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలి. మరొక సెలబ్రిటీకి సవాలు విసరాలి. గతంలో ‘ఐస్‌ బకెట్‌’, ‘రైస్‌ బకెట్‌’ తదితర ఛాలెంజ్‌ల్లానే ఇప్పుడు సినిమా ప్రచారానికి కొన్ని ఛాలెంజ్‌లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే ‘అటాక్‌ ఛాలెంజ్‌’.

జాన్‌ అబ్రహం, జాక్వెలిన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. జిమ్‌లో కసరత్తులు చేసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. టైగర్‌ష్రాఫ్‌, జాక్వెలిన్‌లకు సవాలు విసిరింది. తర్వాత, జాక్వెలిన్‌.. జాన్‌అబ్రహం, లక్ష్యరాజ్‌కు; టైగర్‌ష్రాఫ్‌.. సమంత, జాకీ భగ్నానీకి ఛాలెంజ్‌ విసిరారు. అలా ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత.. శిక్షకుడి సమక్షంలో వెయిట్‌ లిఫ్టింగ్‌సహా కఠిన వ్యాయామాలు చేసింది. వీడియోను నెట్టింట పోస్ట్‌ చేస్తూ టైగర్‌ ష్రాఫ్‌కు ధన్యవాదాలు తెలిపి, అర్జున్‌ కపూర్‌కు సవాల్‌ విసిరింది. ‘నేను నీలా చేయలేను’ అని అర్జున్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. ‘అటాక్‌ ఛాలెంజ్‌’పై మీరూ ఓ లుక్కేయండి..





Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని