Samantha: ప్రియాంక చోప్రా మాటలకు సమంత ఫిదా

నాగచైతన్యతో వైవాహిక బంధానికి ముగింపు పలికిన తర్వాత కథానాయిక సమంత(Samantha) వరుస సినిమాలతో

Updated : 06 Jan 2022 13:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగచైతన్యతో వైవాహిక బంధానికి ముగింపు పలికిన తర్వాత కథానాయిక సమంత(Samantha) వరుస సినిమాలతో బిజీ అయ్యారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా స్ఫూర్తిమంతమైన వీడియోలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా మానసిక స్థైర్యం, ఆర్థిక స్వాతంత్ర్యం వంటి విషయాలను షేర్‌ చేస్తున్నారు.

తాజాగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా పంచుకున్న వీడియోపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకెంతో నచ్చిందంటూ హార్ట్‌ సింబల్‌తో షేర్‌చేశారు. ఇంతకీ ప్రియాంక ఏం చెప్పారంటే.. ‘‘నా చిన్నప్పటి నుంచి మా నాన్న, నాకు తొమిదేళ్ల వయసు నుంచి మా అమ్మ అనేక విషయాలు నేర్పేవారు. ‘ఏదైనా చేయాలనుకుంటే అంతకన్నా ముందు నువ్వు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించాలి. నువ్వు ఎవరి కూతురువి, ఎవరిని పెళ్లి చేసుకున్నావన్నది ముఖ్యం కాదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి’ అని చెప్పేవారు. అప్పటి నుంచి ఆ విషయాన్ని మర్చిపోలేదు. 12ఏళ్ల వయసు నుంచీ దాన్ని ఆచరించటం మొదలు పెట్టా.  ఏటా నేను ఏయే స్థానాలకు వెళ్లాలనుకున్నానో నిర్ణయించుకుంటూ, నా లక్ష్యాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నా’’ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ఆర్థిక స్వాతంత్ర్యం గురించి ప్రియాంక చెప్పిన మాటలకు సమంత ఫిదా అయింది.

నాగచైతన్యతో విడిపోయేందుకు సమంత రూ.200 కోట్ల భరణం అడిగినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. చైతూ నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని