Samantha: సమంతతో సిద్దూ జొన్నలగడ్డ.. ఆ కాంబో రిపీట్ కానుందా..!
నందినీ రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఓ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. అందులో హీరోగా సిద్దూ జోన్నలగడ్డ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
హైదరాబాద్: ‘డీజే టిల్లు’తో మంచి పేరు సంపాదించుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ఇక ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించగలదు సమంత (Samantha). ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
త్వరలోనే సమంత ‘ఖుషి’ (kushi)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత సామ్ ఈ యంగ్ హీరో సినిమాలో నటించనుందని అంటున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందట. గతంలో నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత రెండు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక వీళ్లిద్దరి హ్యాట్రిక్ మూవీగా ఇది రానుందని టాక్ వినిపిస్తోంది. అందులో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా ఇది రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ.. వార్త మాత్రం నెట్టింట తెగ షేర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరు స్క్రీన్ పంచుకుంటే కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నందినీ రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ప్రమోషన్‌లో ఉన్నారు. అది విడుదలయ్యాక ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమంత కూడా ‘ఖుషి’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది. అలాగే ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది. తాజాగా సిటాడెల్ సెట్ నుంచి సమంత ఓ ఫొటో షేర్ చేసింది. ‘నాది పూర్తి స్థాయి యాక్షన్ ప్రేమ కథ’ అనే క్యాప్షన్‌ను జోడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
OTT తర్వాత థియేటర్లోకి.. ఇలా జరగడం ఇదే తొలిసారి
-
Crime News
Train accident: గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. ఏడు బోగీలు బోల్తా!
-
Crime News
Cyber Crime: రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి.. రూ.లక్ష కాజేశాడు!
-
World News
Imran Khan: రూ.1500 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇమ్రాన్‌ఖాన్
-
Crime News
Hyderabad: పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
-
India News
Amit Shah: మణిపుర్ కల్లోలం.. అమిత్ షా వార్నింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..?