Samantha: సెర్బియా క్లబ్‌లో సమంత డ్యాన్స్.. వీడియో వైరల్
‘సిటడెల్’ (Citadel) షూట్ కోసం సమంత (Samantha) ఇటీవల సెర్బియా వెళ్లిన విషయం తెలిసిందే. షూట్ పూర్తైన తర్వాత ఓ క్లబ్‌కు వెళ్లిన ఆమె ‘పుష్ప’ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’.. ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఈ పాట, సమంత డ్యాన్స్‌ను సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. సెలబ్రిటీల నుంచి సినీ ప్రేమికుల వరకూ ఈ పాటకు ఫిదా అయ్యారు. అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటకు తాజాగా సమంత (Samantha) డ్యాన్స్ చేశారు. ‘సిటడెల్’ (Citadel) (ఇండియన్ వెర్షన్) షూట్ కోసం సెర్బియా వెళ్లిన ఆమె.. ఓ క్లబ్‌లో సరదాగా స్టెప్పులు వేశారు. అక్కడే ఉన్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఆమెను డ్యాన్స్ చేయమంటూ ప్రోత్సహించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. ‘పాట వచ్చి రెండేళ్లు అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘శాకుంతలం’ తర్వాత సమంత నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్’. రాజ్ అండ్ డీకే దీన్ని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ధావన్ - సామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇండియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ టీమ్.. కొత్త షెడ్యూల్ కోసం ఇటీవల సెర్బియా వెళ్లింది. బెల్గ్రేడ్‌లో షూట్ పూర్తైన వెంటనే టీమ్ మొత్తం కలిసి ఓ క్లబ్‌కు వెళ్లి సరదాగా గడిపారు. ఈ సమయంలోనే క్లబ్‌లో ‘ఊ అంటావా మావా’ పాటను ప్లే చేయగా సామ్ డ్యాన్స్ చేశారు. ఇక, ప్రియాంకా చోప్రా నటించిన ‘సిటడెల్’కు ప్రీక్వెల్‌గా ఈ సిరీస్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రియాంకకు తల్లిదండ్రులుగా సామ్-వరుణ్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?
-
Amazon Festival Sale: అమెజాన్ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..
-
Social Look: లండన్‌లో అల్లు అర్జున్.. చెమటోడ్చిన ఐశ్వర్య.. సెట్లో రష్మి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..