Samantha: ప్రియాంక చోప్రా తల్లిగా సమంత.. సమాధానం వచ్చినా సందేహమే!

‘సిటడెల్‌’ వెబ్‌సిరీస్‌లో తాను ప్రియాంక చోప్రా తల్లిగా నటిస్తున్నాని వస్తున్న వార్తలపై సమంత స్పందించారు. వాటికి పరోక్షంగా సమాధానమిచ్చారు.

Published : 03 Jun 2023 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తల్లిగా సమంత (Samantha Ruth Prabhu) నటిస్తోందంటూ బాలీవుడ్‌లో ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయంపై స్పష్టత వచ్చింది. సమంత ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా సమాధానమిచ్చింది.

ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌, స్టాన్లీ టుక్కీ తదితరులు ప్రధాన పాత్రల్లో హాలీవుడ్‌ దర్శకులు జోష్‌ అపెల్బమ్‌, బ్రెయాన్‌ ఓహ్‌, డేవిడ్‌ వీల్‌ రూపొందించిన వెబ్‌సిరీస్‌.. ‘సిటడెల్‌’ (citadel). ఇదే సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో తెరకెక్కుతోంది. రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో వరుణ్‌ధావన్‌, సమంత ప్రధాన పాత్రధారులు. హాలీవుడ్‌ ‘సిటడెల్‌’కు.. ‘ఇండియన్‌ సిటడెల్‌’ ప్రీక్వెల్‌ అని, అందులో ప్రియాంకకు తల్లిగా సమంత కనిపించనున్నారని సినీ వర్గాల్లో వినిపించింది. దీనిపై స్పందించిన సమంత నేరుగా సమాధానం ఇవ్వకుండా.. నాదియా సిన్హ్‌కు తల్లిగా నటిస్తున్నానని తెలిపారు. నాదియా నిన్హ్‌ ఎవరో కాదు.. ‘హాలీవుడ్‌ సిటడెల్‌’లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్ర పేరు. అంటే.. ప్రియాంక పోషించిన క్యారెక్టర్‌కు తల్లిగా నటిస్తున్నానని సమంత చెప్పిందేగానీ ప్రియాంకకు తల్లిగా యాక్ట్‌ చేస్తున్నానని కాదు. అయితే, ఈ కథనాలు చూసిన సామ్‌ ఫ్యాన్స్‌, ప్రియాంక చోప్రా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అగ్ర తారలను ఒకే సిరీస్‌లో చూడబోతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ రెండు సిరీస్‌లు వేర్వేరు కాలాలకు సంబంధించినవి కావడంతో ప్రియాంక, సమంత ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఇండియన్‌ వెర్షన్‌ ప్రీక్వెల్‌ కాబట్టి నాదియా సిన్హ్‌ క్యారెక్టర్‌ను ఎవరైన బాల నటి పోషించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి, సమంత సమాధానం ఇచ్చినా సందేహం తొలగాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ప్రియాంక చోప్రా నటించిన ‘సిటడెల్‌’.. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (amazon prime video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని