Published : 03 Jul 2022 01:53 IST

Samantha: విజయ్‌ దేవరకొండ రూల్స్ బ్రేక్‌ చేయగలడు: సమంత

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) రూల్స్‌ బ్రేక్‌ చేయగలడని అగ్రకథానాయిక సమంత(Samantha) అన్నారు. విజయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘లైగర్‌’ (Liger) సరికొత్త పోస్టర్‌పై తాజాగా ఆమె స్పందించారు. బోల్డ్‌గా కనిపించడానికి విజయ్‌ ధైర్యం చేశారని మెచ్చుకున్నారు. ‘‘ఇతనికి నియమ నిబంధనలు తెలుసు. కాబట్టి, వాటిని బ్రేక్‌ చేయగలడు కూడా. ధైర్యం, కీర్తి ఆయన సొంతం. విజయ్‌.. లైగర్‌ పోస్టర్‌ అదిరింది‌’’ అని ఆమె ప్రశంసించారు.

కాగా, సామ్‌ ప్రశంసపై విజయ్‌ రిప్లై ఇచ్చారు. ‘‘సామ్ నువ్వు బెస్ట్‌’’ అని అన్నారు. సామ్‌తోపాటు అనుష్క(Anushka), తమన్నా(Tamannaah) సైతం ఈ పోస్టర్‌పై తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. విజయ్‌ని ప్రశంసిస్తూ.. ‘లైగర్‌’ సూపర్‌హిట్‌ కావాలని కోరుకున్నారు. ఇక, పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన ‘లైగర్‌’ ఆగస్టు 25న విడుదల కానుంది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఇది రూపుదిద్దుకుంది. అనన్యా పాండే కథానాయిక. మరోవైపు, విజయ్‌ దేవరకొండ-సమంత కలిసి ‘ఖుషి’ కోసం పనిచేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఇటీవల కశ్మీర్‌లో జరిగింది. ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో ఈ చిత్రం సిద్ధమవుతోంది.



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని