Samantha: హాలీవుడ్‌లో సమంత చెన్నై స్టోరీ
‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’లతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన అగ్ర కథానాయిక సమంత తన హాలీవుడ్ చిత్రానికి సిద్ధమవుతోంది.
‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’లతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన అగ్ర కథానాయిక సమంత తన హాలీవుడ్ చిత్రానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘చెన్నై స్టోరీ’ అనే పేరు ఖరారైనట్లు సమాచారం. ‘బాఫ్టా’ పురస్కార విజేత ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విల్ మచిన్ నిర్మాత. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కే ఈ చిత్రంలో సమంతకి జోడీగా వివేక్ కల్రా నటించనున్నారు. లండన్‌లో స్థిరపడ్డ భారతీయ మూలాలున్న ఒక ఇంగ్లిష్ యువకుడు నిఖిల్ (వివేక్ కల్రా) తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వస్తాడు. అక్కడ తనకి అను (సమంత) పరిచయం అవుతుంది. నిఖిల్ తండ్రిని వెతకడానికి సాయం చేయడానికి ఆమె ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ చెన్నై, బ్రిటన్‌లలో ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. తూర్పు, పశ్చిమ దేశాల సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ చిత్ర షూటింగ్ చెన్నై, బ్రిటన్‌లలో ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. ఈ హాలీవుడ్ సినిమా ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఒక్క రైతును చూసినా వణుకే!
-
Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్