Samantha: చై-సామ్‌ విడాకులు.. ఆ బాధను అధిగమించడానికి చాలా సమయం పట్టింది

సమంత (Samantha), నాగ చైతన్య (Naga Chaitanya) విడాకులపై నటి తండ్రి జోసెఫ్‌ ప్రభు పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది....

Updated : 07 Sep 2022 15:14 IST

వైరల్‌గా మారిన సమంత తండ్రి పోస్ట్‌

హైదరాబాద్‌: సమంత (Samantha), నాగ చైతన్య (Naga Chaitanya) విడాకులపై నటి తండ్రి జోసఫ్‌ ప్రభు పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. సామ్‌-చై విడిపోవడం తననెంతో కలచివేసిందని ఆయన అన్నారు. ఆ బాధ నుంచి బయటపడటానికి తనకి చాలా సమయమే పట్టిందని  చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ పెట్టారు. సామ్‌-చై పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన ఆయన‌.. ‘‘అప్పట్లో ఓ కథ ఉండేది. కానీ అది ఇప్పుడు లేదు!! కాబట్టి ఇక కొత్త కథ, జీవితంలో కొత్త దశ ప్రారంభిద్దాం!!’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారడంతో దీన్ని చూసిన నెటిజన్లు.. ‘‘సర్‌ మీ ఆవేదన మాకు అర్థమైంది. బీ స్ట్రాంగ్‌’’ అంటూ కామెంట్స్‌ చేస్తూ తమ సానుభూతిని తెలిపారు. నెటిజన్లు తనపై చూపిస్తోన్న అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానం, సానుభూతికి ధన్యవాదాలు. ఆ బాధ నుంచి బయటపడటం కోసం నాకెంతో కాలం పట్టింది. జీవితం చాలా చిన్నది.. బాధతో కుంగిపోతూ అక్కడే ఉండిపోకూడదు’’ అని ఆయన రాసుకొచ్చారు.

సుమారు నాలుగేళ్ల పాటు వివాహ బంధంలో ఉన్న నాగచైతన్య - సమంత గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాము విడిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో సమంత పాల్గొని.. చైతన్యతో తన బంధంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో పెడితే అక్కడ పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలి’ అని అన్నారు. సామ్‌ ఇంటర్వ్యూ వైరల్‌గా మారిన కొన్ని రోజుల తర్వాత చై తన సినిమా ప్రెస్‌మీట్‌లో పాల్గొని.. ‘‘సామ్‌ని నేను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటా. ఒకవేళ ఆమె ఇప్పుడు ఎదురైనా ఒక స్నేహితురాలిగా భావించి పలకరిస్తా. ప్రేమగా హత్తుకుంటా’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని