Samantha: ఎనిమిది నెలలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా: సమంత
అగ్ర కథానాయిక సమంత (Samantha) తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. మయోసైటిస్ కారణంగా కొన్ని నెలలపాటు షూటింగ్స్ కు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే తిరిగి సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు.
హైదరాబాద్: మయోసైటిస్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు నటి సమంత (Samantha). ఓవైపు ‘శాకుంతలం’ (Shaakuntalam) ప్రమోషన్స్, మరోవైపు ‘సిటాడెల్’ (Citadel) షూట్‌తో సామ్ కొత్త ఏడాదిని ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా ఆమె వర్క్ లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. జనవరి నెలలో తన జీవితం ఎలా గడిచిందో ఈ ఫొటోలతో ఆమె స్పష్టం చేశారు. ‘సిటాడెల్’ టీమ్‌తో మీటింగ్, వర్కౌట్లు, అలసట, ఫొటోషూట్‌లతో గత నెల పూర్తైందంటూనే ఓ ఆసక్తికర పోస్ట్‌తో ఆమె.. తనకు తాను ధైర్యాన్ని ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
‘‘గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడెనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులను చూస్తూ ముందుకు సాగావు. వాటిని మర్చిపోవద్దు. ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఆలోచించడం మానేశావు.. దేనిపైనా దృష్టిపెట్టలేకపోయావు.. సరిగ్గా నడవలేకపోయావు.. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగువేశావు. నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో’’ అని సామ్ రాసుకొచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!