Samantha: అఖిల్‌- సమంత బాక్సాఫీసు పోటీ.. ఎప్పుడంటే?

సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.  హరి - హరీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మంగళవారం ఖరారైంది.

Published : 05 Apr 2022 22:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’. హరి- హరీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మంగళవారం ఖరారైంది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏజెంట్‌’ చిత్రం అదే రోజున విడుదలవుతుండటంతో బాక్సాఫీసు వద్ద పోటీ నెలకొన్నట్టైంది. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి హిప్‌హాప్‌ తమిళ స్వరాలు సమకూరుస్తున్నారు. నాయికా ప్రాధాన్య సినిమాకావడంతో ‘యశోద’పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంకావడంతో ‘ఏజెంట్’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు