Samantha: ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న సమంత పోస్ట్‌

అగ్ర కథానాయిక సమంత ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు.....

Published : 26 Feb 2022 01:22 IST

పరాజయాలు, అవమానాలు, విడాకులు..

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా జీవితంలో ఎదురుదెబ్బలు తగిలితే వాటి నుంచి ఎలా బయటపడాలి? అనే అంశంపై పలు ఆధ్యాత్మిక పోస్టులను ఇటీవల కాలంలో సామ్‌ వరుసగా షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన ఓ సందేశాత్మక పోస్ట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌నే షేక్‌ చేస్తోంది. ప్రస్తుతం నెటిజన్లు ఆ పోస్ట్‌పై చర్చించుకుంటున్నారు.

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్.. ‘విల్‌’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని రచించిన విషయం తెలిసిందే. జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యలు.. వాటిని పరిష్కరించిన విధానాలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకంపై సినీ సెలబ్రిటీలు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా నటి సమంత సైతం ‘విల్‌’ చదివారు. ‘‘కష్టపడి పనిచేయండి. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు తిరిగి ఆవిష్కరించుకోండి. ఎప్పటికీ మీలోని ధైర్యాన్ని కోల్పోవద్దు. వీటితోపాటు జీవితానికి కాస్త హాస్యాన్ని జోడించండి’’ అంటూ ఆ పుస్తకాన్ని ప్రశంసిస్తూ సామ్‌ మొదట రాసుకొచ్చారు. అనంతరం.. ‘విల్‌’ని చదివిన అమెరికా రచయిత మార్క్‌ మాన్‌సన్‌ చేసిన పోస్ట్‌ని సామ్‌ రీపోస్ట్‌ చేశారు. ‘‘గడిచిన 30 ఏళ్ల నుంచి అందరిలాగే నేను కూడా పరాజయాలు, అవమానాలు, విడాకులు, మరణం వంటివి ఎదుర్కొంటున్నాను. నా జీవితానికి ప్రాణహాని ఉంది. నా డబ్బు తీసేసుకున్నారు. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు. ఇన్ని ఎదురైనా ప్రతిరోజూ నా జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తూ.. ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ ముందుకు కదులుతున్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావ్‌ అనేది విషయం కాదు. కానీ, నువ్వు మళ్లీ తిరిగి నీ జీవితాన్ని ప్రారంభించావా? లేదా? అనేదే విషయం’’ అంటూ విల్‌స్మిత్‌.. తన పుస్తకంలో రాసుకొన్నారు. అయితే, నాగచైతన్యతో విడిపోయిన తరుణంలో సామ్‌ షేర్‌ చేసిన ఈపోస్ట్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని