Samantha: ఆ సమయంలో బయటకు కూడా రావాలనుకోలేదు: సమంత
Samantha: ‘శాకుంతలం’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: మయోసైటిస్ వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు అగ్ర కథానాయిక సమంత (Samantha) తెలిపారు. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తాజాగా ఆరోగ్య పరిస్థితి గురించి సామ్ చెప్పుకొచ్చారు.
‘‘మయోసైటిస్’ నిర్ధారణ అయిన తొలిరోజుల్లో చాలా బలహీనంగా అనిపించేది. ‘యశోద’ చిత్ర సమయంలో ఆరోగ్యం ఇంకా వీక్ అయింది. అలాగే ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నా. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఓపిక ఉండేది కాదు. ఎన్నో మందులు తీసుకోవాల్సి వచ్చేది. సినిమా నా భుజాలపై ఉండటంతో బాధ్యతగా భావించి అతి కష్టంగానే ఒక ఇంటర్వ్యూ అయినా చేయాలనుకున్నా. ఆ తర్వాత క్రమంలో నా ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. ఇప్పుడు ‘శాకుంతలం’ కోసం ఆరోగ్యం సహకరిస్తోంది. మయోసైటిస్ నుంచి కోలుకుంటూ ధైర్యంగా ఉన్నా’’ అని సమంత తెలిపింది.
గుణశేఖర్ శాకుంతలం కథ చెప్పగానే వెంటనే సున్నితంగా తిరస్కరించానని సమంత వెల్లడించారు. ఇందుకు మూడేళ్లుగా తనలో ఉన్న భయమే కారణమని అన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ తర్వాత శాకుంతలం కథ విన్నానని, కానీ గుణశేఖర్ ఒప్పించి ఈ చిత్రంలో చేయించారని వివరించారు. ఇందులోని పాత్ర ఆహార్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తన వ్యాయామాలు, వర్కవుట్‌లు, డైట్ కూడా మార్చుకున్నట్లు సమంత వివరించారు. శాకుంతలం చిత్రాన్ని వదులుకుంటే తన కలను సాకారమయి ఉండేది కాదన్నారు.
ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలవుతున్న ‘శాకుంతలం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవ్ మోహన్, సచిన్ ఖేడ్కర్, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మరోవైపు సమంత విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’లో నటిస్తున్నారు. అలాగే ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ఇండియన్ వెర్షన్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM