Samantha: ఆ హీరో దర్శకత్వంలో నటించేందుకు సమంత గ్రీన్‌సిగ్నల్...!
స్టార్ హీరోయిన్ సమంత ‘మయోసైటిస్’(ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్)కు చికిత్స తీసుకుంటూనే వరసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. యశోద అందించిన విజయం తర్వాత సమంత మరో చిత్రంలో నటిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
హైదరాబాద్: సినీరంగంలో ఉన్న ప్రతిభావంతులైన కథానాయికల్లో సమంత ఒకరు. తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది సమంత. ప్రస్తుతం సమంత నటించనున్న తర్వాత చిత్రం గురించి అంతటా చర్చనడుస్తోంది. యశోద సక్సెస్ తర్వాత సామ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) సమంతకు ఓ స్టోరీ లైన్ వినిపించారని అంటున్నారు. అది ఆమెకు బాగా నచ్చిందని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇండస్ట్రీలో టాక్. మొదట రాహుల్ ఈ కథను రష్మికకు వినిపించారని అయితే కొన్నికారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో రాహుల్ కథలో కొన్ని మార్పులు చేసి సమంతకు చెప్పగా ఆమె వెంటనే ఓకే చేసిందట. అయితే ఇప్పటి వరకు అటు రాహుల్ కానీ ఇటు సమంత కానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. ప్రస్తుతం సమంత సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: పూజా సీమంతం.. శ్రద్ధాదాస్ హాఫ్‌శారీ.. టీమ్‌తో రాశీఖన్నా!
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!
-
Politics News
Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు
-
Movies News
Natti Kumar: కౌన్సిల్ ఒక్కటే ఉండాలి.. ‘దాసరి’పై సినిమా తీయబోతున్నాం.. నట్టి కుమార్