Samantha: చీకటి రోజులు.. ఆ బాధ నుంచి నేనింకా కోలుకోలేదు.. విడాకుల రోజులపై సమంత వ్యాఖ్యలు
నటుడు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమయంలో తనకు ఎదురైన క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నారు నటి సమంత (Samantha). ఆ క్షణాల్లో తాను చీకటి రోజులు చూసినట్లు చెప్పారు.
హైదరాబాద్: విడాకులు, మయోసైటిస్.. ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులపై ఇటీవల తరచూ స్పందిస్తున్నారు నటి సమంత (Samantha). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె వైవాహిక బంధానికి స్వస్తి పలికిన నాటి రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆ రోజులను ఆమె చీకటి క్షణాలుగా పేర్కొన్నారు. ఆ బాధ నుంచి తానింకా పూర్తిగా కోలుకోలేదంటూ వ్యాఖ్యానించారు.
‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు సామ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా.. ‘విడాకులు తీసుకున్నప్పుడు తనపై వచ్చిన ట్రోల్స్ గురించి అడగ్గా.. ‘‘ఆ సమయంలో నేను.. నా మనసుకు నచ్చినట్లు రియాక్ట్ అయ్యానంతే. అప్పుడు నాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు’’ అని సమంత తెలిపారు.
కన్నీళ్లు చూశా..!
‘‘స్వతంత్ర భావాలు కలిగిన బలమైన మహిళగా మీరందరూ నన్ను అభివర్ణించవచ్చు. కానీ, నన్ను నేను అలా అనుకోవడం లేదు. నేనూ ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలనూ చూశా. ‘నాకు మంచే జరుగుతుందా?’ అంటూ రోజూ మా అమ్మని అడుగుతూనే ఉండేదాన్ని. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చీకటి రోజులు చూశా. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుండేవి. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నా. ముందుకు అడుగు వేశా. కుటుంబసభ్యులు, స్నేహితులు నా వెంటే ఉన్నారు. వాళ్ల వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అయితే, ఆ బాధ నుంచి నేనింకా పూర్తిగా కోలుకోలేదు. ముందుతో పోలిస్తే చీకటి రోజులు ఎంతో తగ్గాయనే నమ్ముతున్నా. క్లిష్టమైన పరిణామాలు ఎదుర్కొన్న తర్వాతే మనలోని ధైర్యం పెరుగుతుంది. ఎప్పటికీ ఆ క్షణాలు అలాగే ఉండిపోవని తెలుసుకోవాలి’’ అని సమంత వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Peddha Kapu-1 Movie Review: రివ్యూ: పెదకాపు.. విరాట్, శ్రీకాంత్ అడ్డాల మూవీ మెప్పించిందా?
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
-
Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం
-
Watch: జుట్టుపట్టుకుని.. కిందపడి తన్నుకుని: లైవ్ డిబేట్లో నేతల కొట్లాట
-
Arvind Kejriwal: కూటమితోనే ఉంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు వివాదం వేళ కేజ్రీవాల్ స్పష్టత
-
Pawan Kalyan: మహేశ్-పవన్‌లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కన్నడ హీరో