
Published : 29 Sep 2021 17:24 IST
Samantha: ఆ రూమర్స్ నిజం కాదు..
అలా ఎందుకు వస్తాయో కూడా నాకు తెలియదు
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటి సమంత త్వరలోనే ముంబయికి మకాం మారుస్తున్నారని.. అక్కడో ఇంటిని కూడా కొనుగోలు చేశారనే వార్త నెట్టింట తెగ చెక్కర్లు కొట్టింది. దీనిపై తాజాగా సమంత కార్లిటీ ఇచ్చేసింది. తన ఫ్యాషన్ లేబల్ ‘‘సాకీ’’ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
ఈ సందర్భంగా ఓ అభిమాని ‘‘ మీరు ముంబయికి షిఫ్ట్ అవుతున్నారంట. నిజమేనా?’’ అని అడగ్గానే.. ‘‘ ఇలాంటి రూమర్స్ ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయో నాకు తెలియదు. ఇలా నాపై వచ్చే వందలాది రూమర్స్ నిజం కాదు. నేను ముంబయికి షిఫ్ట్ అవ్వడం లేదు. ఇప్పటికీ.. ఎప్పటికీ హైదరాబాద్లోనే నా ఇల్లు. ఈ నగరం నాకన్నీ ఇచ్చింది. భవిష్యత్తులోనూ ఇక్కడే ఉంటా’’ అంటూ తనపై వచ్చిన వదంతులకు చెక్ పెట్టంది ఈ యాపిల్ బ్యూటీ.
ఇవీ చదవండి
Tags :