Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
వివాహబంధం బాధాకరంగా ఉండటానికి ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహార్(Karan Johar) కారణమని అగ్రకథానాయిక సమంత(Samantha) సరదాగా ఆరోపణలు చేశారు. రీల్లో చూసేదానికి రియల్‌గా...
ఫుల్ వీడియో కోసం ఎదురుచూస్తోన్న నెటిజన్లు
ముంబయి: వివాహ బంధాలు బాధాకరంగా ఉండటానికి ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహారే(Karan Johar) కారణమని అగ్రకథానాయిక సమంత(Samantha) సరదాగా ఆరోపణలు చేశారు. రీల్లో చూసేదానికి రియల్‌గా అనుభవించేదానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నటుడు నాగచైతన్యతో(Naga Chaitanya) వైవాహిక బంధానికి స్వస్తి పలికిన అనంతరం సామ్ (SAM) ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సామ్ ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసింది? ఎందుకిలా స్పందించిందంటే..?
కరణ్జోహార్కు ఫిల్మ్‌మేకర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగానూ బాలీవుడ్లో మంచి పేరుంది. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఫేమస్ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan). దాదాపు 6 సీజన్లపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఈ షో తదుపరి సీజన్ మరికొన్ని రోజుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘కాఫీ విత్ కరణ్ సీజన్-7’ (Koffee With Karan Season 7) లేటెస్ట్ ప్రోమోని కరణ్ షేర్ చేశారు. ‘కబీర్‌సింగ్’ (KabirSingh) జోడీ షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ, ‘జుగ్ జుగ్ జియో’ (Jugjugg Jeeyo) సభ్యులు అనిల్‌కపూర్, వరుణ్ ధావన్, ‘లైగర్’ జోడీ విజయ్ దేవరకొండ, అనన్యాపాండే, బీటౌన్ ఫ్రెండ్స్ జాన్వీకపూర్, సారా అలీఖాన్‌తోపాటు అక్షయ్‌కుమార్, సమంత... ఇలా పలువురు ఈ సీజన్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నారు. ఇక, తన ఎపిసోడ్లో సామ్.. కెరీర్‌పై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కరణ్.. ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం’’ అని ఆరోపించగానే ‘‘నేనేం చేశాను?’’ అని ఆయన ప్రశ్నించారు. దానికి ఆమె.. ‘‘వైవాహిక బంధమంటే ‘కబీ ఖుషి కబీ ఘమ్’ సినిమాలా ఉంటుందని మీరు స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజజీవితంలో మాత్రం అది ‘కేజీయఫ్’ సినిమాలా ఉంటుంది’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న సమంత, నాగచైతన్య పెద్దల అంగీకారంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల చైతన్య ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు రాగా, వాటిపై చై అభిమానులు స్పందిస్తూ.. ఇదంతా సామ్ టీమ్ కావాలని చేస్తోందని కామెంట్స్ చేశారు. దానిపై సామ్ స్పందిస్తూ ‘‘అమ్మాయిపై వదంతులు వస్తే అవి నిజమే అనుకుంటారు. అబ్బాయిపై అలాంటి వదంతులు వస్తే అమ్మాయే చేయించిందంటారు. అబ్బాయిలూ ఇకనైనా ఎదగండి. మీరు మీ పని మీద, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి’’ అని ఘాటుగా స్పందించారు. వాటిని మర్చిపోక ముందే కరణ్ జోహార్ షోలో సామ్ ఇలా స్పందించడం అంతటా చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్‌బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్‌తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. -
రామ్‌చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
నటుడు రామ్‌చరణ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. -
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్‌కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్ కుమార్ సతీమణి, నటి ట్వింకిల్ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు. -
‘రెయిన్బో’ డ్రెస్సులో పాయల్.. సోఫాలో మానస.. ఊయలూగుతూ శివాత్మిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓ ఇంటివాడైన నటుడు తిరువీర్.. ఫొటోలు చూశారా!
నటుడు తిరువీర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. -
కార్మికుల కోసం అడగ్గానే అంగీకరించారు: చిరంజీవి
ప్రముఖ హీరో చిరంజీవి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు. ఆ సంగతులివీ.. -
నేను ఎప్పటికీ అలాంటి పాత్రలు పోషించను: ఆ సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి!
బాలీవుడు నటుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉండటంపై స్పందించారు. -
యూట్యూబ్‌లో రవితేజ చిత్రం రికార్డు.. నిర్మాణ సంస్థ పోస్ట్
స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger nageswara rao). రవితేజ (ravi teja) కథానాయకుడిగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. -
రష్మిక యాక్టింగ్ సూపర్.. ఆ రోల్ కోసం తొలుత నన్నే అడిగారు: మాజీ ప్రపంచ సుందరి
తన సరికొత్త చిత్రం ‘బడే మియా ఛోటే మియా’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి మానుషి చిల్లర్ (Manushi Chhillar). -
గుండె బరువెక్కింది..: నాని ఎమోషనల్ పోస్ట్
నటుడు నాని (Nani) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’ (Jersey). 2019లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. -
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు. -
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
తన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కెమెరామెన్ చోటా కె నాయుడిని ఉద్దేశిస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ లేఖ విడుదల చేశారు. -
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
నాలుగు క్యారవాన్లు ఇస్తే కానీ సెట్లోకి రారు : సెలబ్రిటీల తీరుపై దర్శకురాలు కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ తారలను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకురాలు పరాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. -
వాళ్ల పార్టీలకు వెళ్లకపోవడం వల్లే మంచి అవకాశాలు రాలేదు: పరిణీతి చోప్రా
తన పీఆర్ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు నటి పరిణీతి చోప్రా చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్‌లో చూసుకుందాం.. లఖ్‌నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు