Updated : 03 Jul 2022 14:03 IST

Samantha: కరణ్‌.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత

ఫుల్‌ వీడియో కోసం ఎదురుచూస్తోన్న నెటిజన్లు

ముంబయి: వివాహ బంధాలు బాధాకరంగా ఉండటానికి ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహారే(Karan Johar) కారణమని అగ్రకథానాయిక సమంత(Samantha) సరదాగా ఆరోపణలు చేశారు. రీల్‌లో చూసేదానికి రియల్‌గా అనుభవించేదానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నటుడు నాగచైతన్యతో(Naga Chaitanya) వైవాహిక బంధానికి స్వస్తి పలికిన అనంతరం సామ్‌ (SAM) ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సామ్‌ ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసింది? ఎందుకిలా స్పందించిందంటే..?

కరణ్‌జోహార్‌కు ఫిల్మ్‌మేకర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగానూ బాలీవుడ్‌లో మంచి పేరుంది. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఫేమస్‌ సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan). దాదాపు 6 సీజన్లపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఈ షో తదుపరి సీజన్‌ మరికొన్ని రోజుల్లో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌-7’ (Koffee With Karan Season 7) లేటెస్ట్‌ ప్రోమోని కరణ్‌ షేర్‌ చేశారు. ‘కబీర్‌సింగ్‌’ (KabirSingh) జోడీ షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ, ‘జుగ్‌ జుగ్‌ జియో’ (Jugjugg Jeeyo) సభ్యులు అనిల్‌కపూర్‌, వరుణ్‌ ధావన్‌, ‘లైగర్‌’ జోడీ విజయ్‌ దేవరకొండ, అనన్యాపాండే, బీటౌన్‌ ఫ్రెండ్స్‌ జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌తోపాటు అక్షయ్‌కుమార్‌, సమంత... ఇలా పలువురు ఈ సీజన్‌లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించనున్నారు. ఇక, తన ఎపిసోడ్‌లో సామ్‌.. కెరీర్‌పై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కరణ్‌.. ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం’’ అని ఆరోపించగానే ‘‘నేనేం చేశాను?’’ అని ఆయన ప్రశ్నించారు. దానికి ఆమె.. ‘‘వైవాహిక బంధమంటే ‘కబీ ఖుషి కబీ ఘమ్‌’ సినిమాలా ఉంటుందని మీరు స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజజీవితంలో మాత్రం అది ‘కేజీయఫ్‌’ సినిమాలా ఉంటుంది’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఫుల్‌ ఎపిసోడ్‌ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న సమంత, నాగచైతన్య పెద్దల అంగీకారంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల చైతన్య ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు రాగా, వాటిపై చై అభిమానులు స్పందిస్తూ.. ఇదంతా సామ్‌ టీమ్‌ కావాలని చేస్తోందని కామెంట్స్‌ చేశారు. దానిపై సామ్‌ స్పందిస్తూ ‘‘అమ్మాయిపై వదంతులు వస్తే అవి నిజమే అనుకుంటారు. అబ్బాయిపై అలాంటి వదంతులు వస్తే అమ్మాయే చేయించిందంటారు. అబ్బాయిలూ ఇకనైనా ఎదగండి. మీరు మీ పని మీద, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి’’ అని ఘాటుగా స్పందించారు. వాటిని మర్చిపోక ముందే కరణ్‌ జోహార్‌ షోలో సామ్‌ ఇలా స్పందించడం అంతటా చర్చనీయాంశంగా మారింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts